గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు రాష్ట్ర స్థాయి సమావేశం

Published: Wednesday February 02, 2022
హైదరాబాద్ 31 జనవరి ప్రజాపాలన ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ముమ్మరంగా జరుగుతోంది. రాష్ట్రం లోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో కాంగ్రెస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏవిధంగా జరుగుతుందని తెలుసుకోవడానికి సమావేశం నిర్వహించారు. రాష్ట్ర స్థాయి లో డిజిటల్ మెంబర్ షిప్ మానీటరింగ్ కమిటీ సమావేశం సోమవారం నాడు గాంధీ భవన్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ అధ్యక్షుతన జరిగింది. ఈ సమావేశానికి వివిధ అసెంబ్లీ నియోజకవర్గ డిజిటల్  మెంబర్ షిప్ మానిటరింగ్ కమిటీ సభ్యులు హాజరయ్యారు. ప్రతి కమిటీ సభ్యుడి ద్వారా ఆయా నియోజకవర్గాల్లో డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏవిధంగా జరుగుతుందని అడిగి తెలుసుకున్నారు. డిజిటల్ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఇంకా ముమ్మరం చేయాలని ఇచ్చిన టార్గెట్ ను సకాలంలో పూర్తి చేయాలని వర్కింగ్ ప్రెసిడెంట్ నియోజకవర్గ సభ్యులకు సూచించారు. పెద్దపల్లి, కరీంనగర్, చొప్పదండి, వేములవాడ, సిరిసిల్ల, మానకొండూరు తదితర అసెంబ్లీ నియోజకవర్గ డిజిటల్ సభ్యత్వ నమోదు ఇంచార్జీ సభ్యురాలు నీలం పద్మ వెంకటస్వామి తో పాటు వివిధ నియోజకవర్గాల ఇంచార్జీ సభ్యులు ఈ సమావేశానికి హాజరయ్యారు.