మధిర మండల విద్యుత్ వినియోగదారులకు విజ్ఞప్తి

Published: Monday July 11, 2022

మధిర జూలై 10 ప్రజా పాలన ప్రతినిధి మండలం పరిధిలో ఆదివారం నాడుఇటీవల ప్రమాదభరితంగా కురుస్తున్న ఎడతెరిపిలేని వానల వల్ల విద్యుత్ సంబంధిత జాగ్రత్తలు తీసుకొనక పోయినట్లయితే విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని విద్యుత్ శాఖ మధిర పట్టణ మరియు గ్రామీణ,ఎఇ నాగేశ్వరావు  తెలియజేస్తున్నారు. మీ ఇంటిలో తడి చేతులతో విద్యుత్ పరికరాలను ముట్టుకోరాదని, ముఖ్యంగా బట్టలు ఆరబెట్టే తీగలకు విద్యుత్ తీగలు తాకకుండా చూసుకోవాలని, అదేవిధంగా ఆరుబయట విద్యుత్ స్తంభాలను తాకకుండా ఉండాలని మరియు రైతులు ట్రాన్స్ ఫారములు వద్దకు వెళ్లకుండా ఉండాలని,  స్టార్టర్ డబ్బాలను నీటిలో తడవకుండా పైకి ఏర్పాటు చేసుకోవాలని,  స్టార్టర్ బాక్సులను ఇనుపవి కాకుండా pvc ను ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఆరుబయట ఉన్న స్థంబాలను ముట్టుకోకుండా మీ  కనుచూపుమేర ఎక్కడైనా విద్యుత్ స్తంభాలు పక్కకు ఒరిగి నట్లయితే, కరెంట్  తీగలు తెగి పడినట్లయితే తక్షణం విద్యుత్ శాఖ సిబ్బందికి తెలియజేయవలసిందిగా మధిర విద్యుత్ శాఖ,ఎఇక నాగేశ్వరావు   కోరుతున్నారు.