ప్రమాదాలకు నిలయంగా రోడ్లు

Published: Friday September 17, 2021
హైదరాబాదు, సెప్టెంబర్ 16, ప్రజాపాలన ప్రతినిధి : పట్ట పగలు కూడా రోడ్డుపైన ముందు వెలుతున్న వాహనం కాని వెనక నుంచి వచ్చే వాహనం కనిపించక వాహనదారుల అవస్థలు. ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ అంటున్న వాహన దారులు. సాధారణంగా ఇలాంటి సమస్య కుండపోతగా వర్షం కురిపిస్తున్న సమయంలో కానీ చలి కాలంలో తెల్లవారుజామున మంచు వల్ల ఏర్పడుతుంది. ఇది అలాంటి సందర్భం కాదనేది యదార్థం. సంగారెడ్డి జిల్లా ఆందోల్ రెవెన్యూ డివిజన్ అధికారి కార్యాలయం ముందు మరమ్మతులు జరుగుతున్న ప్రధాన రోడ్డు పరిస్థితి. నూతన రహదారుల నిర్మాణం లేదా  రోడ్డు మరమత్తు చేసె సందర్భంగా నిర్ణీత పరిమాణంలోని గ్రానైట్ మెటల్ అంటే  కంకరను మరియు కంకర పొడిని (డస్టును) రోడ్డుపై పరిచి తడి ఆరిపోకుండా నీల్లు చల్లడం వల్ల (క్యూరింగు) డస్టు పైకి లేవకుండా ఉండడమే కాకుండా గ్రానైట్ మెటల్ అతుక్కుని ఉండడానికి తోడ్పడుతుంది. కొన్ని సందర్భాల్లో కంకర పరిచిన రోడ్డును నీటితో తడపక (క్యూరింగు) చేయక పోవడం వలన దుమ్ము ధూళి లేచి వాహన దారులు మరియు ప్రయాణికులకు అసౌకర్యంగా ఉంటుంది. అంతే కాకుండా ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుందంటున్నారు. సంబంధిత అధికారులు ఇలాంటి సమస్యలు రాకుండా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు