జర్నలిస్టుల సంక్షేమానికి అన్నివిధాలుగా సహకరిస్తాం

Published: Saturday January 29, 2022
నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ 
మేడిపల్లి, జనవరి 28 (ప్రజాపాలన ప్రతినిధి) : జర్నలిస్టుల సంక్షేమంతో పాటు, ఉప్పల్ ప్రెస్ క్లబ్ అభివృద్ధికి అండగా ఉంటామని నగర మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేర్కొన్నారు. శుక్రవారం ఉప్పల్ మేకల భారతి గార్డెన్ లో జరిగిన కార్యక్రమంలో ఉప్పల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర 2022 డైరీని బొంతు రామ్మోహన్ స్థానిక టీఆర్ఎస్ నాయకుడు బండారు లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డి, కార్పొరేటర్లు బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్, బండారి శ్రీవాణి వెంకట్రావులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ నిరంతరం ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొచ్చి వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తున్న జర్నలిస్టులకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. పత్రికా స్వేచ్ఛను పరిరక్షించడం ద్వారానే ప్రజాస్వామ్య మనుగడ సాధ్యమవుతుందన్నారు. ఉప్పల్ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రతియేటా విస్తృతమైన సమాచారం తో కూడిన డైరీని ఆవిష్కరిస్తున్నందుకు, జర్నలిస్టుల సంక్షేమంతో పాటు, ప్రజా సేవ కార్యక్రమాలు చేపడుతున్న ఉప్పల్ ప్రెస్ క్లబ్ ను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ఉప్పల్ ప్రెస్ క్లబ్ అభివృద్ధికి, జర్నలిస్టులకు పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా అండగా నిలవాలని ఆయన కోరారు. టీయూడబ్ల్యూజే మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు మోతే వెంకట్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి బాలరాజ్ లు మాట్లాడుతూ జర్నలిస్టులకు అండగా నిలిచిన ఉప్పల్ నాయకులకు టీయూడబ్ల్యూజే తరపున ధన్యవాదాలు తెలియజేశారు. టీఆర్ఎస్ సీనియర్ నాయకులు బండారు లక్ష్మారెడ్డి ఉప్పల్ జర్నలిస్టుల సంక్షేమంతో పాటు వారికి ఆరోగ్య బీమా చేయించేందుకు తాను కృషి చేస్తానన్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఉప్పల్ జర్నలిస్టుల సంక్షేమానికి తాను ఎల్లవేళలా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అనంంతరం రామంతాపూర్ కార్పొరేటర బండారి శ్రీవాణి వెంకట్రావు, చిల్కానగర్ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్, బిజెపి సీనియర్ నాయకులు శామీర్ పేట ధర్మారెడ్డి, మల్కాజిగిరి పార్లమెంట్ టిడిపి అధ్యక్షుడు కందికంటిి అశోక్ కుమార్ గౌడ్, మాజీ కార్పొరేటర్ గంధం జోస్నా నాగేశ్వరరావు, ఉప్పల్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గోవిందరెడ్డి లు జర్నలిస్టులు అందిస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు డి.వెంకట్రాంరెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.నరోత్తం రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ వి.తిరుపతిరెడ్డి, ఉపాధ్యక్షులు ఎం.సురేష్ కుమార్, పి సాగర్, ఏ.వి.శ్రీధర్ రావు, కోశాధికారి ఆర్ యాదగిరి గౌడ్, కార్యనిర్వాహక కార్యదర్శులు ఎం అశోక్, దాస రాజు, సంయుక్త కార్యదర్శులు జి.శివాజీ, గుత్తి శేఖర్, సలహాదారులు కె.చంద్రమౌళి, డి.సురేష్, ఎం రామ్ ప్రసాద్ శర్మ, కే.రాజు, శ్రీశైలం, కే.శ్రీనివాస్, వి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.