ఎడతెరిపి లేని వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

Published: Monday July 11, 2022
 వికారాబాద్ జిల్లా కలెక్టర్ నిఖిల
వికారాబాద్ బ్యూరో జూలై 10 ప్రజా పాలన :  జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా అధికారులు అప్రమత్తంగా ఉంటూ తగు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నిఖిల అధికారులను ఆదేశించారు.  ఆదివారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయం నుండి మండల తాసిల్దార్లతో  వర్షాల వల్ల కలుగుతున్న నష్టాలు,  తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామాల్లో శిథిలావస్థలో ఉన్న ఇండ్ల నుండి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చే విధంగా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అవసరమైన ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ తెలిపారు. గతంలో జరిగిన దుర్ఘటనలు పునరావృత్తం కాకుండా తగు చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించినట్లయితే సంబంధిత అధికారులపై చర్యలు చేపడుతామన్నారు. రెవెన్యూ,  ఎంపీడీవోలు,  పోలీస్ సిబ్బంది సమన్వయంతో పని చేస్తూ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా తగు చర్యలు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. అధికారులు క్షేత్రస్థాయిలో ఉండి పనిచేయాలని,  హెడ్ క్వార్టర్ లో అధికారులు తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు. పంచాయతీ రాజ్, ఇరిగేషన్, ఆర్ అండ్ బి,తహసీల్దార్లు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని,  శాఖల పరంగా 24/7 డ్యూటీలు వేసి అట్టి ఆర్డర్ కాపీలను తమకు పంపించాలని కలెక్టర్ సూచించారు. చెరువులు, కాలువలు ఉద్రుతంగా ప్రవహించే ప్రాంతాలలో బ్యారికేడ్లు ఏర్పాటు చేసి సిబ్బందిని ఏర్పాటు చేయాలన్నారు. గ్రామాలలో దండోరా వేయించి ప్రజలను అప్రమత్తం చేయాలని  కలెక్టర్ సూచించారు. అవసరం ఉంటేనే ఇళ్లలో నుండి బయటకు రావాలనే విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని తహసీల్దార్లకు సూచించారు. చెరువుల వద్ద ఇరిగేషన్ అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ఉండాలన్నారు.
 
 
 
Attachments area