తెలంగాణ రైతు గోస కు నిరసన తెలిపిన బిజెపి అందెల శ్రీ రాములు

Published: Tuesday May 25, 2021
బాలపూర్, ప్రజాపాలన ప్రతినిధి : కష్టపడి పండించిన పంటను వెంటనే కొనుగోలు చేయాలని మహేశ్వరం నియోజకవర్గం బిజెపి ఇన్చార్జి అందుల శ్రీరాములు యాదవ్ అన్నారు. తెలంగాణ రైతు గోస-బీజేపీ పోరు దీక్షాఅన్నదాతకు అండగా ఎల్లవేళల బీజేపీ ఉంటుందన్నారు. రైతుబంధు, బీమా అమలు చేయటంలో సీఎం కేసీఆర్ విఫలం అయ్యారని, కేంద్ర పధకాలు కర్షకులకు అందకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటుందిని చెప్పారు. రాష్ట్ర బీజేపీ పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జి అందెల శ్రీరాములు యాదవ్ నిరసన  తెలంగాణ రైతు గోస- బిజెపి పోరు దీక్ష ను స్వగృహం నాదర్ గుల్ లో ఆయన చేపట్టారు. ఈ సందర్భంగా అందెల శ్రీరాములు యాదవ్ మాట్లాడుతూ... ఆరుగాలం కష్టపడి పండించిన పంటను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంభిస్తుందని విమర్శించారు. అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలన్నారు. అదేవిధంగా తాలు, తరుగు పేరుతో రైతులను మోసం చేస్తున్నారనిదుయ్యబట్టారు. కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తున్న సమయంలో రుణమాఫీ అమలు చేయకుండా తాత్సారం చేస్తున్నారని ఆరోపించారు. భవిష్యత్తులో బీజేపీ అధికారంలోకి రాగానే ప్రతీ రైతు, కూలీకి సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. కరోనా వైరస్ విజృంభిస్తున్నందున్న వల్ల స్వీయ రక్షణలో జాగ్రత్తలు పాటించాలని బీజేపీ శ్రేణులు, అభిమానులకు ఆయన సూచించారు. ఈనెల 30 వరకు లాక్ డౌన్ పాటించాలని. అనవసరంగా ఎవరూ బయటకు రావొద్దని విజ్ఞప్తి చేశారు.