ప్రజా పాలన :*షాబాద్ మండల్ సర్దార్ నగర్ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం

Published: Friday November 18, 2022
 ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన మాజీ మంత్రివర్యులు పట్నం మహేందర్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య జడ్పిటిసి పట్నం అవినాష్ రెడ్డి విచ్చేసి నూతన మార్కెట్ కమిటీ పాలకవర్గ సభ్యులని ప్రమాణ స్వీకారం చేయించడం జరిగింది* *ఈ సందర్భంగా మాజీ మంత్రివర్యులు పట్నం మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే కాలే యాదయ్య జెడ్పిటిసి అవినాష్ రెడ్డి మాట్లాడుతూ 30 సంవత్సరాల పాటు పార్టీలో కొనసాగుతూ పార్టీ కోసం ఎంతో శ్రమించి పదవులు కాదు పార్టీ కోసం  శ్రమించడమే ముఖ్యమని నమ్మిన వ్యక్తి నర్సింగ్ రావు పార్టీ మండల అధ్యక్షునిగా పనిచేసి అందరి మెప్పు పొంది మా కుటుంబ సభ్యుల్లో ఒకరిగా ఉంటూ ఇప్పుడు మార్కెట్ కమిటీ చైర్మన్గా  ఎన్నికైనందుకు  సంతోషంగా ఉంది అదేవిధంగా వైస్ చైర్మన్ గా అబ్దుల్ రావుఫ్ ఇతర పాలక వర్గ సభ్యులుగా ఎన్నిక కావడం ఎంతో సంతోషకరం అదేవిధంగా పాలకవర్గ సభ్యులు మార్కెట్లో రైతులను ఎలాంటి లోటు పాట్లు లేకుండా చూసుకోవాలని అన్నారు* *ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ గూడూరు నర్సింగరావు వైస్ చైర్మన్ అబ్దుల్ రావుఫ్ మాట్లాడుతూ మాజీ మంత్రివర్యులు మహేందర్ రెడ్డి ఎమ్మెల్యే కాలే యాదయ్య జెడ్పిటిసి అవినాష్ రెడ్డి షాబాద్ మొయినాబాద్ రెండు మండలాల టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు సర్పంచులు  అందరికీ మ యొక్క కృతజ్ఞతలు మా మీద విశ్వాసంతో నమ్మకంతో  ఈ పదవులు కట్టబెట్టినందుకు అందరికీ రుణపడి ఉంటామని అన్నారు*
 *అనంతరం పాలకవర్గా సభ్యులకు శాలువాలు పూలమాలతో సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో షాబాద్ మొయినాబాద్ రెండు మండలాల ఎంపీపీలు వైస్ ఎంపీపీలు సర్పంచులు మాజీ సర్పంచులు ఎంపిటిసిలు ఎంపీడీవోలు పిఎసిఎస్ చైర్మన్లు డైరెక్టర్లు టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు నూతన కార్యవర్గ సభ్యులు వివిధ గ్రామాల ప్రజలు మహిళలు యువకులు తదితరులు పాల్గొన్నారు*