126వ చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలు

Published: Tuesday September 28, 2021
మల్లాపూర్, సెప్టెంబర్ 27 (ప్రజాపాలన ప్రతినిధి) : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, మహిళా చైతన్యానికి ప్రతీకగా నిలిచిన చిట్యాల (చాకలి) ఐలమ్మ 126వ జయంతి సందర్భంగా మల్లాపూర్ మండలం తో పాటు పలు గ్రామాల్లో ఘనంగా ఐలమ్మ జయంతి ఉత్సవాలను ఆదివారం రజక సంఘాలు నిర్వహించారు. మల్లాపూర్ మండల కేంద్రంలోని రజక సంఘం ఆధ్వర్యంలో ఆదివారం చాకలి ఐలమ్మ 126వ జయంతిని పురస్కరించుకొని ఐలమ్మ ప్రతిమకు పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి అనంతరం కల్లూరి గురువయ్య అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రజక సంఘం జిల్లా కార్యదర్శి గున్నాల శ్రీనివాస్, మండల అధ్యక్షులు బండపల్లి నర్సయ్య లు హాజరయ్యారు. ఈ సందర్భంగా గున్నాల శ్రీనివాస్ మాట్లాడుతూ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి , వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వం తరుపున అధికారికంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించడం గొప్ప శుభదాయకమని అన్నారు. జనగామ జిల్లా పేరును చాకలి ఐలమ్మ జిల్లా గా పేరు మారుస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటివరకు మార్చలేదని త్వరగతిన  ఐలమ్మ జిల్లా గా పేరు పెట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం ఉపాధ్యక్షులు లక్ష్మీరాజం, ప్రధాన కార్యదర్శి జంబుక రమేష్, మల్లాపూర్ గ్రామ అధ్యక్షులు చింతల నర్సయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పుండ్రా శ్రీనివాస్ రెడ్డి, మండల కేంద్రంలో ఎంపిటిసి 2 మర్రిపెల్లి సత్తెమ్మ - మల్లయ్య, మండల బిజేపీ అధ్యక్షులు ముద్దం సత్యనారాయణ గౌడ్, రజక సింహ సేన యూత్ సభ్యులు చంద్రగిరి ప్రమోద్, కల్లూరి నర్సయ్య, కదుర్కపు రాజేందర్, కాల్వ పోచయ్య, చందగిరి పెద్దిరాజం, సిరిపురం రవీందర్, కోటగిరి ఆనంద్ గౌడ్, క్యాతం సురేష్, రజక సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.