ఇబ్రహీంపట్నం మార్చి తేదీ 1ప్రజాపాలన ప్రతినిధి **ఇబ్రహీంపట్నం నుండి బండాలేమూరు మీదుగా నారాయ

Published: Thursday March 02, 2023

ఇబ్రహీంపట్నం నుండి  బండాలేమూరు మీదుగా నారాయణపురం వరకు బస్సును బుదవారం  పునరుద్ధరించారని మాజీ సర్పంచ్ పోచమోని కృష్ణ చెప్పారు. ఈ బస్సు గతంలో 5 సంవత్సరాలు నడిచింది. రోడ్డు చెడి పోవడంతో 3 ఏండ్ల క్రితం ఆపేశారు. ఇటీవల రోడ్డు ను రిపేర్ చేయడం జరిగింది. మళ్లీ బస్సును నడపాలని సీపీఎం ఆధ్వర్యంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ను ఆర్టీసీ అధికారులను కలిసి బస్సును పునరుద్ధరించాలని కోరడం జరిగింది. ఆర్టీసీ ఎండి సాజ్జనార్   సానుకూలంగా స్పందిస్తూ బస్సును నడిపాలని ఇటీవల ఆదేశాలు ఇవ్వడంతో నేడు ఇబ్రహింపట్నం ఆర్టీసీ డిపో నుంచి బస్సును వేయడం జరిగింది.ఈ సందర్బంగా మాజి సర్పంచ్ పోచమోని కృష్ణ మాట్లాడుతూ రంగారెడ్డి జిల్లా మంచాల మండలం బండలేమూరు నుండి యాధాధ్రి జిల్లా నారాయణ పూర్ మండలం పొర్లగడ్డ తండ రోడ్డు రెండు గ్రామాలకే కాకుండా రెండు మండలాల్లో చెందిన అనేక గ్రామాలకే కాకుండా వివిధ మండలాలు నారాయణపురం, శివన్నగూడ మరి కూడా మర్రిగూడ మండలాల  అనేక గ్రామాలు గిరిజన తండాలు రంగారెడ్డి జిల్లాలోని మంచాల, యాచారం ఇబ్రహీంపట్నం మండలాల్లోని అనేక గ్రామాలు గిరిజన తండాలకు బంధుత్వాలు ఉన్నాయి. నిత్యం ఈ  గ్రామాల ప్రజలు రాకపోకలు జరుపుకుంటారు, ఈ గ్రామాలకు అన్నిటికీ ప్రధాన లింక్ రోడ్డు గా  బండాలేమూరు పోర్ల గడ్డ రోడ్డు ఉంది యాదాద్రి రంగారెడ్డి జిల్లాలకు సరిహద్దు గ్రామాల ప్రజలకు ఎంతో మేలైన దగ్గరగా ఉన్న రవాణా సౌకర్యం గా ఉన్నది. ఇట్టి రోడ్డు గుండా గతంలో ఆర్టీసీ బస్సు నడిచింది ఆ రోడ్డు వర్షాలకు శిథిలం అవడంతో బస్సును రద్దు చేయడం జరిగింది. మళ్లీ ఈ రోజు బస్సును పునప్రంబించడం తో రవాణా సౌకర్యం ఏర్పడిందని చెప్పారు. బస్సును పునప్రంబించిన ఆర్టీసీ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ న్నట్లు చెప్పారు. మళ్లీ బస్సు రావడంతో ఈ ప్రాంత ప్రజల సంతోషం వ్యక్తం చేస్తూ న్నట్లు చెప్పారు.