వ్యవసాయ పంటలకు విలువ జోడింపుతోనే రైతుకు ఆదాయం

Published: Friday September 16, 2022
వ్యవసాయ పంటలకు విలువ జోడింపుతోనే రైతుకు ఆదాయం
 
హేమంత్ కుమార్, వైరా కె.వి.కె. శాస్త్ర వేత్త
పాలేరు సెప్టెంబర్ 15 ప్రజాపాలన ప్రతినిధి
ప్రస్తుత పరిస్థితుల్లో రైతులకు వ్యవసాయం లాభసాటిగా ఉండడం లేదు. రసాయనిక వ్యవసాయం వలన రైతులకు పెట్టుబడులు పెరగడంతో పాటు దిగుబడులు కూడా ఆశించిన రీతిలో రాకపోవడం మరియు వచ్చిన దిగుబడులను కూడా సరైన ధరలకు అమ్ముకోలేక పోవడం లాంటి కారణాల వలన పంటల సాగు గిట్టుబాటు కాని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ సమస్యలకు పరిష్కారం కావాలంటే పంటల సాగులో పెట్టుబడులు తగ్గించడంతోపాటు నాణ్యమైన సాగు పద్ధతులు పాటించి విష రసాయనాలు లేని పంట దిగుబడులు పొంది వచ్చిన నాణ్యమైన దిగుబడులకు విలువ జోడించి నేరుగా వినియోగదారులకు అమ్ముకోగలిగితే పంటల సాగు లాభసాటిగా ఉంటుందని ఈ రోజు నాబార్డు సహకారంతో రైతునేస్తం ఫౌండేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబరు 15వ తేదీ గురువారం ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలోని సేంద్రియ రైతు బొమ్మిశెట్టి శ్రీనివాసరావు వ్యవసాయ క్షేత్రంలో సేంద్రియ సాగు మరియు పంట దిగుబడులకు విలువ జోడింపుపై జరిగిన అవగాహన సదస్సులో వైరా కె.వి.కె. శాస్త్రవేత్త హేమంత్కుమార్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఏ.డి. హెచ్. శ్రీమతి అనిత, ఏ.డి.ఏ. విజయచందర్, ఏ.వో. నారాయణరావు, కె.వి.కె. శాస్త్రవేత్త కె. రవికుమార్, రిటైర్డ్ అగ్రికల్చర్ జాయింట్ డైరెక్టర్ డా॥ కె. రామచంద్రం, సేంద్రియ రైతు బొమ్మిశెట్టి శ్రీనివాసరావు లతో పాటు రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ వై. వేంకటేశ్వరరావు పాల్గొన్నారు.
 
నాణ్యమైన