బొడ్రాయి సెంటర్ వద్ద అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన వైస్ ఎమ్.పి.పి , ఉపసర్పంచ్

Published: Saturday October 08, 2022
బోనకల్, అక్టోబర్ 7 ప్రజా పాలన ప్రతినిధి: మండల కేంద్రంలోని బొడ్రాయి సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన దుర్గామాత విగ్రహం వద్ద శుక్రవారం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నదాన కార్యక్రమాన్ని బోనకల్ మండల వైస్.ఎమ్.పి.పి గుగులోత్ రమేష్, గ్రామ ఉపసర్పంచ్ యార్లగడ్డ రాఘవ ప్రారంభించారు. ఈ సందర్భంగా గుగులోత్ రమేష్ మాట్లాడుతూ దేవినవరాత్రుల సందర్భంగా గ్రామంలో భక్తులందరూ ఎంతో భక్తిశ్రద్దలతో దుర్గామాత పూజలలో పాల్గొని బతుకమ్మలు, కోలాటం ఆడి అంగరంగ వైభవంగా బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారనీ కొని ఆడారు. అదేవిధంగా జగన్మాత అయిన దుర్గా దేవి, మహిషాసురుడనే రాక్షసునితో 9 రోజులు యుద్ధము చేసి అతనిని వధించి జయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకున్నారనీ అదే విజయదశమి ఇదే విజయదశమి అని తెలియజేశారు. శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ బతుకమ్మ పండుగన అని నవరాత్రి, శరన్నవరాత్రి అని అన్నారు. ఇంతగొప్పగా ఉత్సవాన్ని నిర్వహిస్తున్న కమిటివారికి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా మైనారిటీ నాయకులు గపూర్, పోటు వెంకటేశ్వర్లు,బాణోత్ మురళి కమిటీ సభ్యులు యార్లగడ్డ శ్రీనివాసరావు,ఉపేందర్, రాము, నవీన్, సాయి నాయుడు,మరీదు ఉపేందర్,ఉపేందర్,పృద్వి, తదితరులు పాల్గొన్నారు.