మొదటి పెండ్లి పత్రిక తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామికి పంపండి - ఆశీస్సులు కానుకలు పొందండి

Published: Monday March 15, 2021
గొల్లపల్లి, మార్చి14 (ప్రజాపాలన ప్రతినిధి): ​మీ ఇంట్లో వివాహం నిశ్చయం అయితే ఓ నెల ముందుగా మొదటి శుభలేఖ స్వామి వారికి పంపండి. వెంటనే తిరుమల నుండి మీకు ఓ విశిష్టమైన కానుక అందుతుంది. దానిలో వధూవరులు చేతికి కట్టడానికి కంకణాలు, అక్షతలు (ఇవి పెళ్ళి నాడు తలంబ్రాలలో కలపండి)వివాహవైశిష్ట్యంతెలిపే పుస్తకం కుంకుమ మహా ప్రసాదం పద్మావతి శ్రీనివాసుల ఆశీర్వచనా లతో బహుమతి పంపడం జరుగుతుంది.. ​తిరుమల నుండి పెళ్ళి ఇంట ఆ స్వామి వారి బహుమతి అందినప్పుడు కలిగే ఆనందం మాటల్లో చెప్పలేము..మీ ఇంట్లో జరిగే వివాహ ఆహ్వాన మొదటి పత్రిక ఈ అడ్రసు కి కొరియర్ చేయండి. శుభలేఖ మీద ఉన్న మన చిరునామాకి స్వామి వారి కానుక అందుతుంది. ​కానుక సంగతి పక్కన పెడితే... వివాహ ఆహ్వాన మొదటి పత్రిక స్వామి వారికి పంపడం శుభప్రథమైన కార్యం. ​శ్రీవారికి పంపడానికి చిరునామా: శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం కార్యనిర్వహణ అధికారి​ టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కేటీ రోడ్ తిరుపతి 517501