ప్రమాదకరంగా మారిన మల్లారం నుండి నెమలి వెళ్లే రోడ్డు

Published: Monday February 21, 2022
మధిర ఫిబ్రవరి 20 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మండలం మల్లారం గ్రామం నుండి నెమలి వెళ్లే రహదారి నిత్యం రద్దీగా ఉన్న ప్రాంతం ఆ రూట్ వెళ్లాలంటే ప్రజల ఇబ్బందులుతో అనేక దెబ్బలు తింటూ యాక్సిడెంట్ అవుతూ మార్గం బాగోక నిత్యం సుబాబుల్ లారీలు అధిక లోడుతో అటువైపు వెళ్తుంటంతో గుంతల మయంగా మారిన రోడ్డు. రోడ్డు పై లారీలు దిగబడి వాహనాల రాకపోకలకు అంతరాయం.వాహనదారులు ఏమాత్రం ఆదమరిచిన ప్రమాదం సంభవించే అవకాశం. ప్రజా ప్రతినిధులు, అధికారులు ఈ విషయాన్ని గమనించి మరమ్మత్తులు చేపట్టాలంటూ కోరిన అయా గ్రామాల ప్రజలు. కోరుకుంటున్నారు