పేదల కళ్ళల్లో ఆనందం నింపడం కోసమే కంటి వెలుగు జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు

Published: Friday March 03, 2023

బోనకల్, ఫిబ్రవరి 2 ప్రజాపాలన ప్రతినిధి:పేదల కళ్ళల్లో ఆనందం నింపడం కోసమే కంటి వెలుగు పథకం సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నట్లు జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు పేర్కొన్నారు. గురువారం మండల పరిధిలోని ఆళ్ళపాడు గ్రామం లో ఏర్పాటు చేసిన రెండవ విడత కంటి వెలుగు పథకాన్ని గ్రామ సర్పంచ్ మర్రి తిరుపతి రావు తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద కుటుంబాలకు అండగా నిలవాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కంటి వెలుగు అమలు చేస్తున్నట్లు తెలిపారు. కంటి వెలుగు శిబిరం లో వైద్యులు అందుబాటులో ఉండి పరీక్షలు చేసిన అనంతరం వారికి అవసరమైన కంటి అద్దాలను అందించడం జరుగుతోందని పేర్కొన్నారు.ప్రజలెవరు కంటి సమస్యల తో బాధపడవద్దనే లక్ష్యం తో కంటి పరీక్షలు నిర్వహించి అద్దాలతో పాటుగా మందులు ఉచితంగా ఇవ్వడం జరుగుతుందన్నారు. వేలాది కుటుంబాలకు అండగా మారిన బృహత్తర పథకం కంటి వెలుగు పథకం అన్నారు.
 ముఖ్యమంత్రి కేసీఆర్ ముందు చూపుతో పేద కుటుంబాలకు భరోసా కలుగుతుందని స్పష్టం చేశారు. ఈ కంటి వెలుగు ను అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మర్రి తిరుపతిరావు, బీఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షులు బంధం శ్రీనివాసరావు, బీఆర్ఎస్ నాయకులు పారా ప్రసాద్, గద్దల వెంకటేశ్వర్లు, పలువురు ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.