నిరుపేద బాధితులకు సీఎం సహాయనిధి

Published: Friday July 09, 2021
బాలాపూర్, జులై 08, ప్రజాపాలన ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో సీఎం రిలీఫ్ ఫండ్ నిరుపేదల కుటుంబాలకు ఎల్ల వేళ అండ.. దండలు పుష్కలంగా ఉన్నాయని మంత్రి అన్నారు. బడంగ్ పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 10వ డివిజన్ కార్పొరేటర్ బొద్ర మోని రమేష్ ముదిరాజ్ సమక్షంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదగా గురువారం నాడు పేద బాధితులకు చెక్కులను అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.... రాష్ట్రంలోని ప్రతి నిరుపేద కుటుంబాలను ఆదుకోవాలని దృక్పథంతో సీఎం సహాయ నిధి నిక్షేపంగా వస్తుందని బాధితులకు నమ్మకం అని చెప్పారు. స్థానిక కార్పొరేటర్ మాట్లాడుతూ..... గతంలో అనారోగ్యంతో బాధపడుతున్న బాధితులను మంత్రి ఇచ్చిన మాటను నిలబెట్టుకునే ప్రయత్న ఫలితమే గురువారం నాడు బి మహేష్ (32) తండ్రి శంకరయ్య ముప్పై ఐదు వేలు చెక్కు ను, అదేవిధంగా బి.ప్రభాకర్ (40) తండ్రి రామయ్య అరవై వేలు చెక్కును ఇద్దరు కుర్ములగూడ నివాసులైన బాధితులను ఆదుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేశారు.