కంటివెలుగు ను సద్వినియోగం చేసుకోవాలి ఎంపీపీ లలిత కుమారిసర్పంచ్ శిరీష మధిర రూరల్ మార్చి ఒకట

Published: Thursday March 02, 2023
తెలంగాణ కంటి వెలుగు ప్రోగ్రాంలో భాగంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ తరపున మండల పిహెచ్సి దెందుకూరు వైద్యులు డా. పృథ్వి ఆధ్వర్యంలో తొండల గోపవరం గ్రామంలో సామాజిక సేవకులు విశ్రాంత ఉపాధ్యాయులు రాష్ట్ర పెన్షనర్ సంఘ సభ్యులు శ్రీ పారుపల్లి వెంకటేశ్వరావు రైతు సేవా కేంద్రం నందు ఏర్పాటు చేసిన తెలంగాణ కంటి వెలుగు ప్రోగ్రాంను గ్రామ ప్రధమ పౌరురాలు శ్రీమతి పింగళి శిరీష రామిరెడ్డి చేతుల మీదుగా మరియు ఎంపీపీ మొండెం లలితఎంపీడీఓ విజయభాస్కర్ రెడ్డి కంటి వెలుగు డాక్టర్ సునీత  సమక్షంలో రిబ్బన్ కట్ చేసి శిబిరం ప్రారంభించినారు. ఈ సందర్బంగా ఎంపీపీ మొండెం లలిత  మాట్లాడుతూ తెలంగాణ కంటి వెలుగు కార్యక్రమం ప్రతి ఒక్కరూ కంటి వెలుగును సద్వినియోగం చేసుకోవాలని అలాగని తెలంగాణ ప్రజలకు వరంలాంటిది అని ఎంతో విలువైన కంటి పరీక్షలు చేసి చూపును బట్టి కంటి అద్దాలు ఉచితముగా పొందవచ్చు అని ఆమె సూచించారు. ఈ కార్యక్రమం లో ఆరోగ్య సిబ్బంది హెచ్ఇఒ సనప గోవింద్ హెచ్ఎస్ లంకా కొండయ్య ఎఎన్ఎమ్ భారతి  ఎఎన్ఎమ్ నాగమణి  జిపి సెక్రటరీ విజయలక్ష్మి కంటి వెలుగు సిబ్బంది కొమ్ము ప్రశాంత్ కుమార్ డేటా ఎంట్రీ ఆపరేటర్ మల్లికార్జున్ కంటి వెలుగు వాహనం డ్రైవర్ ఖాన్ ఐకేపీ సిబ్బంది అంగన్వాడీ సిబ్బంది రెవిన్యూ సిబ్బంది అదేవిధంగా టీ గోపవరం పెద్దలు పింగళి రామిరెడ్డి  మచ్చగొపి  రైతు సేవకేంద్ర నిర్వహకులు చావా వెంకటేష్ రావు స్వాతంత్ర సమర యోదులు చావా సత్యనారాయణ ఇతర తొర్లపాడు సాయిపురం గ్రామ ప్రజలు పాల్గొన్నారు.