*రోడ్డుపై బైఠాయించి ధర్నా చేస్తూ రోదిస్తూ తమ సమస్యలు చెప్పుకుంటున్న కస్తూర్బా విద్యార్థిను

Published: Friday September 02, 2022

ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 1 ప్రజాపాలన ప్రతినిధి.రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ పరిధిలోని వినోభ నగర్ కస్తూర్బా బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో కనీసం అవసరాలకు, తాగడానికి కూడా నీరు

లేకపోవడం తీవ్ర నీటి ఎద్దడి ఏర్పడడంతో మెయిన్ రోడ్డుపై బైఠాయించి సుమారు 3 గంటల పాటు విద్యార్థినులు ధర్నా చేయడం జరిగింది. పలువురు విద్యార్థులు రోదిస్తూ రోడ్డుపై బైఠాయించి, తమ సమస్యలు వేంటనే పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు.ఈ సందర్భంగా పలువురు బాధిత విద్యార్థినులు మాట్లాడుతూ ఈ కస్తూరిబా హాస్టల్లో ఉన్నవంటి విద్యార్థినులందరం గత నాలుగైదు రోజులుగా స్నానాలు కూడా చేయడానికి నీరు లేదని,కనీస అవసరాల కోసం కూడా చుక్క నీరు లేకపోవడం, టాయిలెట్స్లో కూడా చుక్క నీరు లేదని,నీటి సమస్య వల్ల మలమూత్ర విసర్జనకు కూడా వెళ్లే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. భోజనం చేశాక ప్లేట్ కడగడానికి నీళ్లు లేని కారణంగా ఒకే ప్లేటులో ముగ్గురం భోజనం చేస్తున్నామని కన్నీటి పర్యంతమయ్యారు. ఆడపిల్లలమైన మేము మా కనీస అవసరాలు తీర్చుకోలేక అటు బయటికి వెళ్లలేక, తమ సమస్యలు ఎవరితో చెప్పుకోలేక నరకం అనుభవిస్తున్నామని ఆగ్రహం వ్యక్తం చేశారు.రాష్ట్రంలో, దేశంలో కూడా ఎక్కడా లేని పరిస్థితి ఈ కస్తూర్బా హాస్టల్ లో ఉందని ఊడికి ఉడకని అన్నం పురుగులు పడ్డ అన్నం పెడుతున్నారని,మరుగుదొడ్లు కూడా పూర్తిగా కంపు కొడుతూ కాళ్లు మోపలేని పరిస్థితిలో ఉన్నాయని,చుట్టూ చెట్లు చేమలు ఉండడంతో దోమల బెడద చాలా ఉందని, అయినా కానీ ఫ్యాన్లు కూడా లేకపోవడం వల్ల రాత్రులు నిద్ర పోలేకపోతున్నామని,ఇప్పటికే అనేక వ్యాధులు ప్రబలుతున్నాయనిన్నారు. కనీస సౌకర్యాలు లేకపోవడంతో పలువురు విద్యార్థినులు ఇప్పటికే టీసీ తీసుకొని వెళ్లిపోయారని,అనేకమార్లు అధ్యాపకులకు సిబ్బందికి అధికారులకు విన్నవించుకున్న ఉపయోగం లేదని ఆవేదన చెందారు.రోడ్డుపై ధర్నా చేస్తున్న విద్యార్థులకు మద్దతుగా ఉన్న ఎస్ఎఫ్ఐ నాయకులకు, అప్పుడు అక్కడికి వచ్చిన టిఆర్ఎస్ నాయకులకు మధ్య కొంత సేపు వాగ్దిత్వం బాహి బాహి జరిగింది. స్థానిక ప్రజా ప్రతినిధులు అధికారులు నచ్చజెప్పిన విద్యార్థినిలు వినక పోవటంతో హుటాహుటిన ధర్నా వద్దకు ఆర్డిఓ వెంకటాచారి,డీఈఓ అధికారులు వచ్చి నీటి సమస్య,మిగతా సమస్యలను కూడా తప్పకుండా తీరుస్తానని హామీ ఇవ్వడంతో ధర్నా సద్దుమణిగింది.ఇబ్రహీంపట్నం నుండి దండుమల్లారం వెళ్లే ప్రధాన రహదారిలో వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు పడగా,మూడు గంటల పాటు పూర్తిగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. ధర్నా చేస్తున్న విద్యార్థులకు వివిధ విద్యార్థి సంఘాలు సంఘీభావం తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఏసీబీ ఉమామహేశ్వరరావు,ఎంపీపీ కృపేష్,ఎంఈఓ వెంకటరెడ్డి, కమిషనర్ యూసుఫ్, కౌన్సిలర్లు నీళ్ల భాను గౌడ్, యాచారం రవీందర్ భర్త కి జగన్ పలువురు అధికారులు ప్రజాప్రతినిధులు,తెరాస నాయకులు మడుపు వేణుగోపాల్, తాళ్ల మహేష్ గౌడ్, మహిళా పోలీస్ సిబ్బంది ,విద్యార్థి నాయకులు నందకిషోర్ కస్తూరి విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.