జంట కార్పొరేషన్లలో వరదనీటి నాలా పనుల జాప్యంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మేయర్లు

Published: Wednesday May 25, 2022
మేడిపల్లి, మే 24 (ప్రజాపాలన ప్రతినిధి)
పీర్జాదిగూడ,బోడుప్పల్ జంట మున్సిపల్ కార్పొరేషన్లలో వరద ముంపుకు శాశ్వత పరిష్కారం కొరకు మంత్రి చామకూర మల్లారెడ్డి,మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ సహకారంతో  
ఎస్ఎన్డిపి ద్వారా రూ.110కోట్ల నిధులు కేటాయించారు. ఇందులో భాగంగా స్ట్రామ్ వాటర్ డ్రైన్ నిర్మాణానికి టెండర్ దక్కించుకున్న గూత్తేదారులు ఇప్పటికే పనులు ప్రారంభించడం జరిగింది.వివిధ కారణాల ద్వారా పనుల్లో జాప్యం జరగడం, మొదలు పెట్టిన పనులు నత్తనడకన సాగుతుండటంతో జంట మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు, కార్పొరేటర్లు గుత్తేదార్ల పై అసహనం వ్యక్తం చేశారు. అందులో భాగంగా పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో పీర్జాదిగూడ, బోడుప్పల్ జంట మున్సిపల్ కార్పొరేషన్ల మేయర్లు జక్క వెంకట్ రెడ్డి, సామల బుచ్చి రెడ్డి ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.స్ట్రామ్ వాటర్ డ్రైన్ నిర్మాణ పనుల్లో జాప్యం జరుగుతుండటంతో గుత్తేదారునిపై మేయర్లు ఆగ్రహం వ్యక్తం చేయడంతో నిలిచిపోయిన పనులను తిరిగి ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా 4 వర్కింగ్ టీంలను ఏర్పాటు చేసి
చెంగిచర్ల చింతల చెరువు నుండి, బోడుప్పల్ ఆల్మాస్ కుంట నుండి, పీర్జాదిగూడ చెరువు, పర్వతాపూర్ చెరువు నుండి మూసికి కలిపే విధంగా ఇలా నాలుగు మార్గాలలో పనులు ప్రారంభించి అనుకున్న సమయానికి నిర్మాణ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.రానున్న వర్షాకాలంలో ప్రజలు గతంలో లాగా ఎలాంటి ఇబ్బందులు పడకుండా స్ట్రామ్ వాటర్ డ్రైన్ పనులు త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో పీర్జాదిగూడ డిప్యూటీ మేయర్ కుర్ర శివ కుమార్ గౌడ్, బోడుప్పల్ డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి రవి గౌడ్, మున్సిపల్ కమీషనర్ డా. పి. రామకృష్ణ రావు, 
ఎస్ఎన్డిపి అధికారులు, నాయకులు జోడిగే కృష్ణ గౌడ్, కొత్త రవి గౌడ్,అలవాల దేవేందర్ గౌడ్, డిిఈలు, ఏఈలు తదితరులు పాల్గొన్నారు.