తెలంగాణ ప్రతీక బతుకమ్మ పండుగ. ఐ టి డి ఏ పి ఓ గౌతమ్ పోట్రు.

Published: Tuesday October 04, 2022
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ప్రజా పాలన.
   భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జరుగుతున్న సద్దుల బతుకమ్మ మరియు దసరా పండుగ ఉత్సవాలను ఘనంగా జరుపుకొనుటకు అందరి అధికారుల సహకారం విజయవంతం అవ్వడానికి అందరూ అధికారుల సహకారం ఉందని ఐ టి డిఏ ప్రాజెక్టు అధికారి గౌతమ్ పో ట్రు అన్నారు. 
    సోమవారం నాడు తన చాంబర్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని తాసిల్దారులు ఆయనకు మర్యాదపూర్వకంగా కలిసి సద్దుల బతుకమ్మ మరియు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణలో బతుకమ్మ మరియు దసరా పండుగ అనేది చాలా పవిత్రమైన పండుగలని ఆ పండుగలను ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఘనంగా జరుపుకోవాలని ఆయన కోరుతూ తనకు శుభాకాంక్షలు తెలిపిన తాసిల్దారులకు మరియు ఐటిడిఏ పరిధిలో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి సద్దుల బతుకమ్మ దసరా పండుగ శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు ఆయన అన్నారు. 
    ఈ కార్యక్రమంలో టిఆర్ ఈ ఎస్ ఏ జిల్లా అధ్యక్షులు భగవాన్ రెడ్డి, జిల్లా కార్యదర్శి శ్రీనివాసరావు మరియు భద్రాద్రి కొత్తగూడెం డివిజన్ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area