వ్యవసాయ పనిముట్లు, సోలార్ లైట్లు పంపిణీ చేసిన డీఎస్పీ రాఘవేందర్ రావు అశ్వాపురం (ప్రజా పాలన.)

Published: Wednesday November 16, 2022

అశ్వాపురం మండల పరిధిలోని మల్లెలమడుగు గ్రామపంచాయతీ పరిధిలోని రేగా కాలనీ వాసులకు
141 సిఆర్పిఎఫ్ బెటాలియన్  సహకారంతో ఏర్పాటు చేసిన వ్యవసాయ పనిముట్లు, సోలార్ లైట్లను  డీఎస్పీ రాఘవేందర్ రావు బెటాలియన్ కమాండెంట్ ప్రశాంత్ ధార్ తో కలసి మంగళవారం పంపిణీ చేశారు.ఈ సంధర్బంగా డీఎస్పీ రాఘవేందర్ రావు మాట్లాడుతూ ఆదివాసి బిడ్డలు
వ్యవసాయంపై ఆధారపడి జీవనం
సాగిస్తున్నందున వారి వ్యవసాయ అవసరాలను తీర్చడానికి సిఆర్పిఎఫ్ 141 బెటాలియన్ ముందుకు వచ్చి  వ్యవసాయ పనిముట్లు పంపిణీ చేయడాన్ని
ప్రశంసించారు. కరెంటు సౌకర్యం లేక చిమ్మ చీకట్లో అవస్థలు పడుతున్న ఆదివాసి గ్రామంలో సోలార్ లైట్లు ఏర్పాటు చేసినందుకు బెటాలియన్ కమాండెంట్ ప్రశాంత్ ధార్ ను, వారి బృందాన్ని అభినందించారు. ఆదివాసీ ప్రజలు  సంఘంలో గౌరవ మర్యాదలతో జీవించాలని, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారికి ఆశ్రయం ఇవ్వవద్దని ఎలాంటి అవసరమైనా స్థానిక పోలీసు వారిని సంప్రదించి తగిన సహాయ సహకారాలు పొందాలని
సూచించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వారికి ఆశ్రయమిస్తే కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. ఉన్నత విద్య అభ్యసించి పేదరికాన్ని జయించాలని వారికి  పిలుపు నిచ్చారు. ఈకార్యక్రమంలో  స్థానిక సీఐ చెన్నూరి శ్రీనివాస్ , బెటాలియన్ సెకండ్ కమాండెంట్ కమల్ వీర్ యాదవ్, డిప్యూటీ కమాండెంట్ సింగర వేల్, అసిస్టెంట్ కమాండెంట్ హేమంత్ కుమార్ శర్మ, స్థానిక సర్పంచ్ కోడి కృష్ణవేణి, ఇన్స్పెక్టర్లు ఆనంద్ ప్రకాష్, మనీష్ కుమార్, సముద్రాల జితేందర్, ఎస్కే నాగుల్ మీరా, రతన్ సింగ్, సగర్మాల్ కల్ రౌనా, మణుగూరు డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ భూక్య శ్రీనివాస్, ఉపసర్పంచ్ చావా వీర రాఘవులు,పంచాయతీ కార్యదర్శి
బిందు, అంగన్వాడి టీచర్ దీప్తి, బెటాలియన్ జవాన్లు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.