సావిత్రిబాయి చరిత్రను స్ఫూర్తిగా తీసుకొని బాలికలు రాణించాలి బిజెపి రాష్ట్ర ఐటీ సెల్ కన్వీ

Published: Wednesday January 04, 2023

బోనకల్, జనవరి 3 ప్రజాపాలన ప్రతినిధి: స్థానిక మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించిన సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలు అగ్గాపే చారిటీ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ భూక్య సైదా నాయక్, బిజెపి ఎస్టీ మోర్చా రాష్ట్ర ఐటీ సెల్ కన్వీనర్ బీపీ నాయక్, స్థానిక ఎంపీపీ గూగులోత్ రమేష్ లు పాల్గొన్నారు.ముందుగా సావిత్రిబాయి పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రంలో నిర్వహించిన సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొన్నారు, ఈ సందర్భంగా బీపీ నాయక్ మాట్లాడుతూ నిరక్షరాస్యులైన సావిత్రిబాయి పూలే భారతదేశపు మొట్టమొదటి ఉపాధ్యాయులుగా కీర్తిఘడించారని, అది అంత సులువుగా దక్కిన గౌరవం కాదని, వాటి వెనక ఎన్నో కష్టాలను అవమానాలను వారు భరించారని అప్పటి నిరంకుశ సమాజంతో పోరాడారని. వారి జీవనం అందరికీ మార్గదర్శమని, ప్రస్తుత కాలంలో గ్రామీణ ప్రాంతాలలో పదవ తరగతి తర్వాత ఉన్నత విద్యను వదిలేస్తున్న బాలికలు, వారి కుటుంబీకులు సావిత్రిబాయి జీవిత చరిత్రను స్ఫూర్తిగా తీసుకొని బాలికలు మరింత రాణించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సంస్థ నిర్వాహకులు జగదీష్, రమేష్ నాయక్,అంతటి శివ, స్థానిక పంచాయతీ వార్డు సభ్యులు ఉప్పర శీను, అంగన్వాడి కార్యకర్తలు టీచర్లు తదితరులు పాల్గొన్నారు.