అర్హులైన ప్రతి ఒక్కరికి ఇండ్ల పట్టాలు ఇవ్వాలి - బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్

Published: Saturday May 28, 2022

నస్పూర్, మే 27, పజాపాలన ప్రతినిధి: సింగరేణి ప్రాంతంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇండ్ల పట్టాలు ఇవ్వాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ డిమాండ్ చేశారు. శుక్రవారం నస్పూర్-శ్రీరాంపూర్ ప్రెస్ క్లబ్ లో అయన విలేకరుల సమావేశం లో మాట్లాడారు  సింగరేణి ప్రాంతంలో నివాసం ఉంటున్న 2800 కుటుంబాలు దరఖాస్తు చేసుకుంటే కేవలం 950 మందికి మాత్రమే పట్టాలు ఇచ్చి ఈ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని అన్నారు. రాబోయే సింగరేణి ఎన్నికల్లో లబ్ధి పొందటానికే ఇండ్ల పట్టాల పేరుతో సింగరేణి కార్మికులను మోసం చేస్తున్నారని అన్నారు. 2013 లో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సర్వే నంబర్ 72,64,119 లో పేద ప్రజలకు ఇండ్ల పట్టాలు ఇచ్చి ఇప్పటి వరకు వారికి భూమి చూపించలేదని అన్నారు. టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఆడుతున్న డ్రామాల వల్ల పేదలకు స్వంత ఇంటి కళ కలలాగే మిగులుతుందని అన్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ 2018 ఫిబ్రవరి శ్రీరాంపూర్ లో నిర్వహించిన సభలో కార్మికులకు 400 కొత్త క్వార్టర్లు, ఉచిత మంచి నీరు, మిషన్ భగీరథ నీరు, ఉచిత కరెంట్ అందిస్తామని చెప్పి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా కార్మికులకు మోసం చేశారని అన్నారు. అర్హులైన ప్రతి ఒక్క కుటుంబానికి డబుల్ బెడ్ రూం ఇండ్లు, దరఖాస్తు చేసుకున్న 2800 కుటుంబాలకు పట్టాలు అందించాలని, సింగరేణి క్వార్టర్లు మిషన్ భగీరథతో అనుసంధానం చేసి ఉచితంగా త్రాగు నీరు అందించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో  బీజేపీ పట్టణ అధ్యక్షుడు ఆగల్ డ్యూటీ రాజు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోనుగోటి రంగ రావు, మిట్టపల్లి మొగిలి, సత్రం రమేష్, ఈర్ల సదానందం, జోగుల శ్రీదేవి, రంగు వేణు, రావనవెని శ్రీనివాస్, మద్ది సుమన్, కొండ వెంకటేష్, రాజన్న, కుర్రె చక్రి, మాడిషెట్టి సతీష్, మహేందర్, సతీష్ పాల్గొన్నారు