ఆర్టీసీ సిబ్బందిని నమ్మించి తడి గుడ్డతో గొంతులు కోశారు

Published: Monday February 07, 2022
జెఏసి వైస్ చైర్మన్ టిజెఎంయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.హనుమంతు ముదిరాజ్
వికారాబాద్ బ్యూరో 06 ఫిబ్రవరి ప్రజాపాలన : టిఎస్ఆర్టిసి లో వెంటనే ట్రేడ్ యూనియన్లను అనుమతించి ఎన్నికలు జరపాలని జెఏసి వైస్ చైర్మన్ టిజెఎంయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.హనుమంతు ముదిరాజ్ డిమాండ్ చేశారు. ఆదివారం జేఏసీ పిలుపు మేరకు వికారాబాద్ టిఎస్ఆర్టిసి లో ఉద్యోగుల సంతకాల సేకరణ చేేశారు. ఈ సందర్భంగా కె హనుమంతు మాట్లాడుతూ సంతకాల సేకరణ రాష్ట్రవ్యాప్తంగా ఈనెల 5వ తేదీ నుండి 14వ తేదీ వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. తెలంగాణ సిద్ధించక ముందు ఆర్టీసీ ఉద్యోగులు అగ్రభాగంలో ఉండి పోరాటం చేశారని గుర్తు చేశారు. టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ గత రెండు సంవత్సరాల క్రితం సమ్మె తర్వాత యూనియన్ లను రద్దు ప్రకటన చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీలోని సమస్యల పరిష్కారానికి నేను కృషి చేస్తానని నమ్మించి ఆర్టీసీ సిబ్బంది గొంతులను తడిగుడ్డతో కోశారన్నారు. టిఎస్ఆర్టీసీలో 49 వేల మంది ఆర్టీసీ సిబ్బంది శారీరకంగా, మానసికంగా, ఆర్థికంగా అనేక ఇబ్బందులకు గురయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. టిజెఎంయు రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి జివికె రెడ్డి డిపో కార్యదర్శి గోపాల్ మాట్లాడుతూ టిఎస్ఆర్టిసి లో లేకపోవడంతో 2017, 2021 రెండు వేతన సవరణలు చేయకపోవడం, ప్రతి ఆరు నెలలకొకసారి ఇవ్వవలసిన కరువు భత్యం (DA) లు 6 ఇవ్వకపోవడం, 2013 వేదన సవరణకు సంబంధించిన ఏరియర్స్ 50% బకాయిలు ఇవ్వకపోవడం, చట్ట వ్యతిరేక డ్యూటీలకు రోజుకు 10, 12,14,16 గంటల వరకు డ్యూటీలు చేయించడం, రకరకాల వేధింపులతో ఇబ్బందులకు గురి చేయడం, ఎదురు మాట్లాడితే డ్యూటీలు ఇవ్వకపోవడం, కిలోమీటర్లు పెంచడం, డిపో స్పేర్ లో పెట్టడం, సస్పెండ్ చేయడం, రిమూవ్ చేయడం, టిఎస్ఆర్టిసి లో ఖాళీలు భర్తీ చేయకపోవడం, ప్రమోషన్లు ఇవ్వకపోవడం, ఆన్ డ్యూటీలో చనిపోయిన ఉద్యోగుల పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వకపోవడం, అనారోగ్య రీత్యా మెడికల్ అన్ ఫిట్ అయితే వారి పిల్లలకు ఉద్యోగాలు ఇవ్వకపోవడం, సిసిఎస్, పిఎఫ్, ఎస్ఆర్బిఎస్ లలో ఆర్టీసీ ఉద్యోగులు పొదుపు చేసుకున్న సొంత డబ్బులను 2500 కోట్లకు పైగా యాజమాన్యం అవసరానికి వాడుకోవడం ఈ విధంగా అనేక రకాలుగా ఆర్టీసీ సిబ్బందిని సర్వనాశనం చేశారని వివరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ డిపో అధ్యక్షుడు డేవిడ్, డిపో వర్కింగ్ ప్రెసిడెంట్ రుక్కయ్య,  జాయింట్ సెక్రెటరీ వసంత్ గౌడ్ మరియు వికారాబాద్ డిపో జెఏసి నాయకులు పాల్గొన్నారు.