నల్లగొండ జాతర పోస్టర్ను ఆవిష్కరించిన రసమయి

Published: Monday February 27, 2023

మానకొండూరు ఫిబ్రవరి 26 ప్రజాపాలన రిపోర్టర్:


మానకొండూర్ నియోజకవర్గం తిమ్మాపూర్ మండలం నల్లగొండ గ్రామంలోని శ్రీ సీతారామ లక్ష్మీ నృసింహ్మస్వామి దేవస్థానం బ్రహ్మోత్సవ వేడుకల (జాతర) పోస్టర్ను ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర సాంస్కృతిక సారథి చైర్మెన్, ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఆవిష్కరించారు. ఈనెల 26 నుండి వచ్చేనెల 10వ తేది వరకు అత్యంత వైభవంగా జరిగే ఈ వేడుకలకు మానకొండూర్ నియోజకవర్గంలోని ప్రజలు భారీ సంఖ్యలో హాజరై స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కోరారు.