ప్రజాపాలన కొడంగల్ ప్రతినిధి ఫిబ్రవరి22:

Published: Thursday February 23, 2023
బహుజన సాహిత్య అకాడమీ (BSA) జాతీయ కమిటీ ఆధ్వర్యంలో 2023 వ సంవత్సరమునకు గాను అంబేద్కర్ జాతీయ నేషనల్ అవార్డుకు కొడంగల్ కు చెందిన రమేష్ బాబు ఎంపికైనట్లు జాతీయ అవార్డు కమిటీ వారు ప్రకటించారు. అక్షరం ఆరోగ్యం ఆర్థికం రంగాలలో గ్రామీణ ప్రాంతాలలో విశేష కృషి చేసినందుకుగాను ఈ అవార్డుకు ఎంపిక చేసినారని,
అవార్డు సెలక్షన్ కమిటీ నేషనల్ చైర్మన్  జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ గారు అవార్డు ఆహ్వాన పత్రాన్ని హైదరాబాదులోని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కార్యాలయంలో అందజేశారు.
ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ ఎస్సీఎస్టీ బీసీ మైనార్టీల సాహిత్యాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం బహుజన సాహిత్య అకాడమీ వారు ప్రతి ఏటా ప్రజా ఉద్యమకారులకు, సంఘ సేవకులకు, రచయితలకు కవులకు,స్వచ్ఛంద సంస్థలకు ఈ అవార్డు అందజేయనున్నట్లు తెలియజేశారు. ఈ సంవత్సరం మార్చి 12వ తేదీన ఆంధ్ర ప్రదేశ్ లోని తిరుపతిలో నిర్వహించే బహుజన రైటర్స్ 6వ సౌత్ ఇండియా కాన్ఫరెన్స్ సందర్భంగా విద్యా రత్న నేషనల్ అవార్డును అందజేయనున్నట్లు తెలియజేశారు. సౌత్ ఇండియాలో ఆంధ్రప్రదేశ్,తెలంగాణ,తమిళనాడు, కర్ణాటక, కేరళ,పుదుచ్చేరి రాష్ట్రాల నుండి సుమారు 600 మంది డెలిగేట్స్ కాన్ఫరెన్స్ కు హాజరవుతారని తెలియజేశారు. ఈ అవార్డు లెటర్ అందజేసిన వారిలో BSA తెలంగాణ అధ్యక్షులు గౌతం మల్లేష్ గారు, స్వేరో సర్కిల్ జిల్లా అధికార ప్రతినిధి ఎరన్ పల్లి శ్రీనివాస్, హ్యూమన్ రైట్స్ కమిషన్ జిల్లా నాయకులు రఫీ, భీమ్ రాజ్, అంబేద్కర్ సంఘాల జిల్లా నాయకులు వెంకట రాములు తదపాల్గొన్నారు.