వాసవీక్లబ్ గవర్నర్ అధికారిక పర్యటన

Published: Saturday October 09, 2021
పలు సేవా కార్యక్రమాల నిర్వహణకు కార్యాచరణ.
మంచిర్యాలబ్యూరో, అక్టోబర్08, ప్రజాపాలన : మంచిర్యాల వాసవీక్లబ్ జిల్లా గవర్నర్ కలికోట శ్రీనివాస్ అధికార పర్యటనలో భాగంగా మంచిర్యాల వాసవీక్లబ్ పలు సేవా కార్యక్రమాలను శుక్రవారం నిర్వహించారు. మొదట స్థానిక విశ్వనాథ ఆలయంలోని వాసవీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. వాసవీ క్లబ్ నిర్వహిస్తున్న సరస్వతి పథకంలో భాగంగా ఇద్దరు నిరుపేద కుటుంబాలకు చెందిన విద్యార్థినీలకు రెండు వేల రూపాయల చొప్పున ఆర్ధిక సహాయంను విద్య కోసం అందజేశారు. అలాగే ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో గర్భిణి స్త్రీలతో పాటు చిన్నారులు, రోగులందరికి బ్రెడ్ పంపిణీ చేశారు. అనంతరం వాసవీక్లబ్ -2021 సంవత్సరంలో నిర్వహించిన సేవా కార్యక్రమాలను గవర్నర్ కలికోట శ్రీనివాస్ అడిగి తెలుసుకుని క్లబ్ నిర్వహించిన సేవా కార్యక్రమాల స్సాప్ బుక్, ఫోటో అలబమ్, రికార్డులను పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గవర్నర్ కలికోట శ్రీనివాస్ మాట్లాడుతూ, మంచిర్యాల పట్టణంతో పాటు వివిధ ప్రాంతాల్లో వాసవీక్లబ్ అనేక సేవా కార్యక్రమాను నిర్వహించిందని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో వానవీక్లబ్ సరస్వతి పథకం ద్వారా పేద కుటుంబాలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులను ఆదుకుంటుందని, అవసరమైన చోట పుస్తకాల పంపిణీ చేపడుతుందన్నారు. తాత్కాలిక సేవలతో పాటు శాశ్వత సేవాకార్యక్రమాలకు వాసవీక్లబ్ ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఈ కార్యక్రమాలలో వాసవీక్లబ్ అంతర్జాతీయ ఉపాధ్యక్షుడు కటుకం హరీష్, అంతర్జాతీయ ప్రోగ్రాం కోఆర్డినేటర్ దొంతుల ముఖేష్, వికెఎపి జిల్లా ఇంచార్జి అప్పాల శ్రీధర్, జిల్లా క్యాబినెట్ సెక్రటరీ ఇల్లందుల కిశోర్, రీజియన్ ఛైర్మన్ పుల్లూరి బాలమోహన్, కార్యదర్శి నాగిశెట్టి శ్రీనివాస్, జోన్ ఛైర్మన వుత్తూరి రమేష్, మంచిర్యాల వాసవీక్లబ్ అధ్యక్షుడు కాచం సతీష్, కార్యదర్శి కేశెట్టి వంశీకృష్ణ, సభ్యులు ఎర్రం వెంకటేష్, గంప నాగేందర్, కేశెట్టి నారాయణ, సామ దామోదర్, వుత్తూరి తిరుపతి తదితరులు పాల్గొన్నారు.