ఆర్య వైశ్య సంఘం అధ్వర్యంలో ఉచిత సూపర్ స్పెషాలిటీ హెల్త్ క్యాంప్ ను ప్రారంభించిన ఎమ్మేల్యే డ

Published: Monday October 17, 2022

జగిత్యాల, అక్టోబర్,16 ( ప్రజాపాలన ప్రతినిధి): పట్టణములో సర్దార్ సత్రం లో ఆర్య వైశ్య సంఘం అధ్వర్యంలో ఉచిత సూపర్ స్పెషాలిటీ హెల్త్ క్యాంప్ ను ఎమ్మేల్యే డా. సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి ప్రవీణ్ ప్రారంభించినారు. అనంతరం రోగులకు మందులు పంపిణీ చేసినారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ హరి చరణ్ రావు, పట్టణ వైశ్య సంఘం అధ్యక్షులు మంచాల కృష్ణ, పట్టణ పార్టీ అధ్యక్షులు గట్టు సతీష్, ఎంపీపీ రాజేంద్ర ప్రసాద్, కౌన్సిలర్ లు బొడ్ల జగదీష్, కప్పల శ్రీకాంత్, వివిధ విభాగాల వైద్యులు, వైశ్య సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.