వడ్లు తూకం ఐన వెంటనే రైతులకు రిసిప్ట్ లు ఇవ్వాలి బీజేపీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్

Published: Thursday May 19, 2022
లక్షెట్టిపేట , మే18,  ప్రజా పాలన ప్రతినిధి:
 
వరిదాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద వడ్లు  తూకం ఐన వెంటనే సంబంధించిన రైతులకు  రిసిప్ట్ లు ఇవ్వాలని బీజేపీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ డిమాండ్ చేశారు.

బుధవారం మండలంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్  పలు గ్రామాల్లో,  వడ్ల కల్లాల వద్ద పర్యటించి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను వారిని అడిగి తెలుసుకున్నారు, అనంతరం ఐబిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వడ్ల కొనుగోలు కేంద్రాల వద్ద రైతులను వడ్ల తూకంలో రైతులను 40 కిలోలకు 44, 45 కిలోలు తుకం వేస్తూ తీవ్రంగా మోసం చేస్తున్నారని , మిల్లులో మిల్లర్లు కూడా 40 కిలోలకు 1,2 కిలోలు తీస్తూ మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు, వడ్లు కాంటా అయిన తర్వాత రైతులకు రశీదు ఎందుకు ఇవ్వడం లేదని కొనుగోలు సెంటర్ వారిని ప్రశ్నించారు, జిల్లా కలెక్టర్ వద్ద నుండి రశీదు బుక్కులు కొనుగోలు సెంటర్ వారికి అందినా కూడా రైతులకు రశీదు లు ఇవ్వక పోవడం ఏంటని ప్రశ్నించారు, రైసు మిల్లర్లు రశీదు లు ఇవ్వద్దని అంటున్నారని కొనుగోలు సెంటర్ వాళ్ళు చెప్పడం జరిగింది, రైసు మిల్లర్ల వాళ్ళు , అధికార పార్టీ వాళ్లు అందరూ కుమ్మక్కు కావడం వల్లనే రైతులు నష్టపోతున్నారని అన్నారు, వడ్లు కాంట అయిన వెంటనే రైతులకు రశీదు ఇవ్వాలని , కాంట అయిన వడ్లను వెంటనే తరలించాలని లేకపోతే రైతులందరితో బీజేపీ పోరాటం మొదలు అవుతుందని హెచ్చరించారు, ఈ కార్యక్రమంలో బీజేపీ మున్సిపాలిటీ అధ్యక్షుడు విరమాళ్ళ హరిగోపాల్ రావు, మండల అధ్యక్షులు బోప్పు కిషన్, నాయకులు పెద్దపెల్లి పురుషోత్తం, గాదే శ్రీనివాస్, జోగుల శ్రీదేవి, కిసాన్ మోర్చ జిల్లా రమణా రావు, జిల్లా కోశాధికారి గుండా ప్రభాకర్, జిల్లా కార్యవర్గ సభ్యులు వేముల మధు, ముష్కం గంగన్న , తోట సునీత,  చాత్తరాజు శివ శంకర్, గడమల్ల చంద్రయ్య, హేమంత్ రెడ్డి, శ్రీరామ్, సమర సింహా,  బొల్లారం సాయి తదితరులు పాల్గొన్నారు.