ట్రింగ్ ట్రింగ్.. పోస్టు పోస్టు

Published: Wednesday July 07, 2021
హైదరాబాద్ జులై 6 ప్రజాపాలన : ట్రింగ్  ట్రింగ్.. పోస్టు పోస్టు; ట్రింగ్  ట్రింగ్.. పోస్టు పోస్టు... పల్లె, పట్నం అనే తేడా లేకుండా పోస్టు అనే శబ్ధం వినని వారు ఉండరనుకుంటా. ప్రపంచం సాకేతికంగా ఎంత ఎదిగినా! ఇ-మెయిల్ కనుగొన్నాక తపాల శాఖకు పనిలేదన్నారు కాని నేటికి తపాల శాఖ ఉత్తరాల బట్వాడ అనే వ్యవస్థ సజీవంగానే ఉన్నది. వాట్సప్, ట్విట్టర్, ఇన్-స్టాగ్రాం లాంటి న్యూ మీడియాలు ఎన్ని వచ్చిన తపాల శాఖ ఉత్తరాల బట్వాడ కొరకు నిత్యం ఎదురు చూసే వారెందరో ఉన్నారు. ఉద్యోగం కొరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకున్నా! సర్టిఫికేట్స్ నఖలు అంటే హార్డు కాపీలు పంపించక తప్పదు. డ్రైవింగ్ లైసెన్స్, మనలను  అన్ని చోట్ల అడిగే  ఆధార్ కార్డు, ప్యాన్ కార్డు, పుస్తకాల పార్శిల్లు ఇలా చెప్పుకుంటూ పోతే చిట్టా శాంతాడంత అవుతది. వీటన్నింటిని మనందరి ఇల్ల ముందుకు వచ్చి అందించేది తపాల శాఖ అనేది నఘ్న సత్యం. కొన్ని ప్రైవేటు సంస్థలు కొరియర్ వ్యవస్థ పేర ఈలాంటి సేవలను కూడా అందిస్తున్నాయి. ప్రతి గ్రామము కూడలిలో, పట్టణ ప్రధాన వీధులలో, పెద్ద ఆఫీసుల ముందు, బస్సు స్టేషన్ లలో, రైల్వే స్టేషన్ లలో తాళం వేసి ఉన్న ఎర్రరంగుతో తపాల పెట్టె తప్పకుండా ధర్శనం ఇస్తుంది. రైల్వే భోగీలో కూడ ఈ సౌకర్యం అందుబాటులో ఉన్నది. తపాల సంచులను  బస్సుల ద్వారా ఒక చోటు నుండి ఇంకొక చోటుకు చేరవేస్తారు. ఇంతటి చరిత్ర గల తపాల పెట్టెలు అనేక చోట్ల దీనావస్థలో కనిపిస్తున్నాయి. వాటికి చిన్నపాటి మరమ్మత్తులు చేసి వినియోగంలోకి తీసుకొని వస్తే ప్రజలకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందనేది ప్రజల అభిప్రాయం. ఒక్క తపాల శాఖలోనే కాదు అన్ని శాఖలలో ఉద్యోగుల కొరత స్పష్టంగా కనిపిస్తుంది. తపాల శాఖ వ్వవస్థలో ఉన్న సంపదని నిరుపయోగంలో ఉంచకుండా వాటిని వినియోగంలోనికి తీసుకొని రావడం వల్ల ప్రజలు ఎక్కువగా తపాల శాఖ అందించే  సేవలను ఉపయోగించుకునే అవకాశం ఉన్నది. ప్రయాణ ప్రాంగణాలలో (బస్సు స్టేషన్ లలో) ప్రధాన కూడలిలో, ఆఫీసుల వద్ద తపాల పెట్టెలు సక్రమంగా కనిపించడం లేదు. ఒకవేల ఉన్నా అవి జీర్ణావస్థలో ధర్శనమిస్తాయి. ఇలాంటి చోట తపాల సేవలను వినియోగించు కోవాలంటే ఎక్కడో దూరాన ఉన్న తపాల ఆఫీసుకు వెల్లక తప్పని పరిస్థితి. ఇలాంటి వాటిని గుర్తించి వాటిని వినియోగంలోకి తీసుకొని రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఎన్నో రోజులనుండి నిరుపయోగంలో ఉన్న ఈ తపాల పెట్టె సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండల ప్రజా పరిషత్ కార్యలయ సముదాయం ముందు కనిపిస్తుంది. ఈ చుట్టు ప్రక్కల దాదాపుగా 12 ప్రభుత్వ కార్యాలయాలు పనిచేస్తున్నాయి. వీటిని దృష్టలో ఉంచుకొని ఆకాలం నాడు ఈ తపాల పెట్టెను ఇక్కడ ఉంచడం జరిగినది. ఎందుకు పనికి రాకుండా ఆఫీసు సముధాయాల ప్రధాన దారికి అడ్డంగా, ప్రైవేటు వాహనాల పార్కింగ్ సరసన దిష్టిబొమ్మలా దీనావస్థలో ఒక పక్కకు ఒరిగి పోయి ఉన్నది.