మా సర్పంచే అరాచకవాధి, ఆయన తీరుతోనే గ్రామంలో అశాంతి స్వార్థ ప్రయోజనాల కోసం కక్ష సాధింపు చర్య

Published: Monday October 10, 2022

బోనకల్ అక్టోబర్ 9 ప్రజా పాలన ప్రతినిధి: మాగ్రామ సర్పంచే ఒక అరాచక వాది అని ఆయన తీరుతోనే గ్రామంలో అశాంతి నెలకొన్నదని, వ్యక్తులను లక్ష్యంగా ఎంచుకొని దాడులు చేయించేందుకు ప్రయత్నిస్తున్నాడని రాపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్, సి.పి.ఎం, సి.పి.ఐ, టీడీపీ నాయకులు పేర్కొన్నారు. ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ తరచూ పార్టీలు మారడం తన ఆర్ధిక అరాచకానికి అడ్డు తగిలిన వారిని ఇబ్బంది పెట్టడం ఆయనకు అలవాటేనన్నారు. టి.ఆర్.ఎస్. పార్టీని కాని ఆపార్టీ నాయకత్వాన్ని కాని తాము విమర్శించడం లేదని సర్పంచ్ మందడపు తిరుమలరావు వ్యక్తిగత స్వార్ధ రాజకీయాలనే ప్రశ్నిస్తున్నామని ప్రజలకు తెలియజేస్తున్నామని వారు తెలిపారు. సర్పంచుగా ఉండి ఖమ్మం డబుల్ బెడ్రూమ్ పేరుతో ఇసుక కూపన్లు తెచ్చి అధిక ధరకు విక్రయించాడని గ్రామంలో లేని పలువురి పేర్లపై ఇ.జి.ఎస్ డబ్బులను కాజేశాడని వారు ఆరోపించారు. ఇదే విషయమై గ్రామ సభలో ప్రశ్నించేందుకు సిద్దమైన వారిపై తన అనుచరులతోపాటు స్వయంగా తానే కర్రపట్టి దాడి చేసేందుకు ప్రయత్నించాడని ఈవ్యవహారం మొత్తం సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగిందని వారు తెలిపారు. గ్రామ పంచాయతీ లెక్కల్లో పెద్ద ఎత్తున గోల్ మాల్ జరిగిందని ఇప్పటికీ గ్రామ ప్రజల ముందు జమాఖర్చులు ఉంచలేదన్నారు. ఆది నుంచి వివాదాస్పద వ్యవహారాలు చేస్తూ గ్రామంలో అశాంతిని పెంచి పోషిస్తుంటాడని ఏ ఇరువురి మధ్య వివాదం జరిగినా తలదూర్చి తన స్వార్ధ ప్రయోజనాల కోసం కక్ష్యలను ప్రేరేపిస్తాడని వారు తెలిపారు. ఇంతటి ఆర్థిక అరాచక వారి భవిష్యా రాష్ట్రంలో లేరని వారు అన్నారు. దొంగలను అనైతిక చర్యలకు పాల్పడేవారిని వెంటేసుకొని ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాడని ఆయన తీరును గ్రామ సభలో అధికారులు, పోలీసులు కూడా గమనించారన్నారు. బోలెం రమణ మిర్చితోట పంచాయతీలో ఎవరి పాత్ర మేమిటో గ్రామస్తులకు తెలుసునని వారు అన్నారు. ఇప్పటికే మూడు పార్టీలు మారిన అయినా నాల్గోపార్టీ మారేందుకు సిద్దమయ్యాడని గ్రామ ప్రజలు ఈ విషయం గమనించడంతో ఇతరులపై నిందారోపణలు చేస్తున్నాడని వారు తెలిపారు. ఏ పార్టీలో ఉ న్నా ఆపార్టీకి కాకుండా ఇతర పార్టీలకు ఓట్లు వేయించడం ఆయన నైజమన్నారు డబ్బులు కోసం ఎటువంటి చర్యలకైనా పాల్పడే తిరుమలరావు వైకరిని రాపల్లిగ్రామ ప్రజలు అర్ధం చేసుకున్నారని అందుకే నిత్యం అబద్దాలతో కాలం గడుపుతున్నాడని ఆరోపించారు. స్వాతంత్య్ర సమరయోధులను బెదిరించడం డబ్బులు వసూళ్ళుచేయడం, తనకున్న భూమికంటే ఎక్కువ భూమిని నమోదు చేయించుకోవడం అలాంటి అనేక చర్యలకు పాల్పడుతున్నాడని టి.ఆర్.ఎస్.ప్రజా ప్రతినిధులు కూడా తిరుమల రావు పరిస్థితిని గమనించి తగు చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులు, ప్రజా ప్రతినిధులు మొత్తంగా గ్రామంలో జరుగుతున్న వ్యవహారం పై విచారణ జరిపించాలని ||అశాంతికిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. టి.ఆర్.ఎస్. పార్టీకి అంకితమై పనిచేస్తున్నవారిని గ్రామంలో వేధింపులకు గురి చేస్తున్నాడని తన నాయకత్వం తప్ప మరొకరిని సహించలేని స్ధితిలో ఆయన ఉన్నారన్నారు. ఈ సమావేశంలో గంగవరపు ప్రసాద్, కొండపల్లి బిక్ష్మారెడ్డి, మోదుగు వెంకట కృష్ణ, సి.పి.. ఎం నాయకులు కొనకళ్ళ హన్మంతరావు, గంగదేవుల నర్సింహారావు, బలమర్తి అచ్చారావు, సి.పి.ఐ నాయకులు ఏనుగు రామకృష్ణ, ఏనుగు రవికుమార్, కొండపనేని రాధాకృష్ణ, టీడీపీ నాయకులు మాజీ ఉపసర్పంచ్ సాదినేని సీతారామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.