అభివృద్ధి పథంలో ముందంజ వేస్తున్న చీమల్ దరి

Published: Wednesday December 21, 2022
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ బ్యూరో 20 డిసెంబర్ ప్రజా పాలన : అభివృద్ధి పథంలో పరుగులు పెడుతున్న చీమల్ దరి గ్రామం అని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ప్రశంసించారు. మంగళవారం మోమినిపేట మండల పరిధిలోని చీమల్ దరి గ్రామంలో మీతో నేను కార్యక్రమంలో భాగంగా వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు దబ్బని వెంకట్ ఆధ్వర్యంలో గ్రామ సర్పంచ్ నాసన్ పల్లి నరసింహారెడ్డి, ఎంపీటీసీ మానస ఇంద్రారెడ్డి, పంచాయతీ కార్యదర్శి సుగుణ, ఎంపీపీ వసంత వెంకట్ ల తో కలిసి వీధి వీధి తిరిగి క్షేత్రస్థాయిలోని ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ మాట్లాడుతూ పల్లె ప్రగతే ప్రథమ లక్ష్యంగా సీఎం కేసీఆర్ కృషి అభినందనీయమని కొనియాడారు. ప్రతి పల్లె అభివృద్ధి చెందితేనే దేశ ఆర్థిక అభివృద్ధి చెందుతుందని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సీఎం కేసీఆర్ తోడ్పాటు మరువలేనిదని గుర్తు చేశారు. గ్రామంలో ఆశా వర్కర్ లేకపోవడంతో ఇబ్బందికరంగా ఉందని ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తెచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే వైద్యశాఖ అధికారులతో మాట్లాడి చీమల్ దరి గ్రామంలో ఆశా వర్కర్ ను నియమించాలని సూచించారు. విద్యుత్ సమస్య పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు. గ్రామానికి లో... ఓల్టేజ్ సమస్య ఉన్నందున నూతనంగా ట్రాన్స్ఫార్మర్ వెంటనే మంజూరు చేయాలని చెప్పారు. పంట పొలాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ స్తంభాలకు విద్యుత్ తీగలు  ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. వేలాడుతున్న విద్యుత్ తీగలను సరిచేయాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. గ్రామంలోని బావులపై పైకప్పులు ఏర్పాటు చేయాలన్నారు.
 పశువులు త్రాగే నీటి తొట్టిని  ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలన్నారు.
 మిషన్ భగీరథ త్రాగునీటిలో ట్యాంకు నిండి నప్పుడు బ్లీచింగ్ పౌడర్ కలిపేలా చర్యలు తీసుకోవాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతూ ఆహ్లాదకరంగా  తీర్చిదిద్దిన గ్రామ సర్పంచ్ నాసన్ పల్లి నరసింహారెడ్డిని, పంచాయతీ కార్యదర్శి టి. సుగుణను పొగడ్తలతో ముంచెత్తారు. వికారాబాద్ నియోజకవర్గంలో మొత్తం 131 గ్రామాలు ఉండగా ఇప్పటివరకు 114 గ్రామాలలో మీతో నేను కార్యక్రమం నిర్వహించానని వివరించారు. గ్రామంలో 232 మందికి ఆసరా పెన్షన్లు వస్తుండడం అభినందనీయమని తెలిపారు. గ్రామ అభివృద్ధికి 8 లక్షల రూపాయలను మంజూరు చేస్తున్నానని అన్నారు. మీతో నేను కార్యక్రమం చీమల్ దరి గ్రామంలో ప్రశాంత వాతావరణంలో జరిగేందుకు కృషిచేసిన సర్పంచ్ నాసన్ పల్లి నరసింహారెడ్డి గ్రామ పెద్దలను గ్రామస్తులను అభినందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచుల సంఘం అధ్యక్షుడు, ఎంపిటిసిల ఫోరం అధ్యక్షుడు, మండల సర్పంచులు, మండల ఎంపిటిసిలు, మండల వివిధ శాఖల అధికారులు ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.