మొక్కలు పెంచుదాం, భావితరాలను కాపాడుకుందాం

Published: Tuesday June 15, 2021
మందమర్రి, జూన్ 14, ప్రజాపాలన ప్రతినిధి : మందమర్రి ఏరియాలోని సివిల్ డిపార్ట్మెంట్ ఆవరణలో మందమరి ఏరియా జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ సోమవారం మొక్కలు నాటారు ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత అని  ఇందుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని మన చుట్టూ ఉన్న ప్రదేశాలు పచ్చదనంతో నిండి ఉన్నట్లయితే వాయు కాలుష్యం కాకుండా మొక్కలు తోడ్పడతాయని స్వచ్ఛమైన ప్రాణవాయువు అందిస్తాయని ఇప్పుడు మనం నాటిన మొక్కలు భావితరాలకు ఫలాలను అందిస్తాయని నాటిన ప్రతి మొక్కను సంరక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు అలాగే సింగరేణి వ్యాప్తంగా నిన్న నిర్వహించుకున్న మెగా వ్యాక్సినేషన్ కార్యక్రమం మన మందమరి ఏరియాలో విజయవంతంగా నిర్వహించుకున్నాం అని మందమర్రి ఏరియాలోని యువ ఉద్యోగులందరూ ముందుకు వచ్చి వ్యాక్సిన్ తీసుకున్నారని అలాగే మిగిలిన ఉద్యోగులందరూ త్వరగా తీసుకునేందుకు ముందుకు రావాలని అన్నారు ఈ కార్యక్రమంలో డీజీఎం సివిల్ శ్రీనివాసులు, పర్యావరణ అధికారి ప్రభాకర్, సివిల్ ఈ ఈ జయ ప్రకాష్, ఆఫీస్ ఇంచార్జ్ రాజేందర్, మరియు సివిల్ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.