దోచుకోవడానికే వచ్చినట్లుగా ధరలను పెంచుతున్న కేంద్ర బిజేపి - రాష్ట్ర టీఆర్ఎస్ ప్రభుత్వాలు..

Published: Monday March 28, 2022
ఇబ్రహీంపట్నం మార్చి 27 ప్రజాపాలన ప్రతినిధి : దేశంలో - రాష్ట్రంలో రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్ డీజిల్, నిత్యావసర సరుకుల ధరలు మరియు విద్యుత్ చార్జీల ధరల పెంపును నిరసిస్తూ బహుజన్ సమాజ్ పార్టీ ఇబ్రహీపట్నం నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక అంబేడ్కర్ చౌరస్తా వద్ద శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో.. జిల్లా కార్యదర్శిలు, అసెంబ్లీ ఇంచార్జీలు పల్లాటి రాములు నల్ల ప్రభాకర్ అసెంబ్లీ అధ్యక్షులు గ్యార మల్లేష్ అసెంబ్లీ ఉపాధ్యక్షుడు ధార యాదగిరి అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి బోళ్ల గణేష్ ముదిరాజ్ అసెంబ్లీ కోశాధికారి కొండ్రు రఘుపతి పెద్దలు కావాడపు శంకర్ రెడ్డి హనుమoడ్ల కిష్టయ్య మండల కన్వీనర్లు.. బంగారి మైసయ్య గడ్డం రమేష్, గడకొండ్ల ప్రవీణ్, మున్సపాలిటీల అధ్యక్షులు. చింతపట్ల నగేష్, వద్ధిగల్ల బాబు, యంజాల ప్రహ్లాద్, సెక్టార్ కమిటి సభ్యులు పెద్ద ముత్తని గణేష గంగిరెడ్డి సుధాకర్ రెడ్డి, శేకర్, సుక్క రవి, తదితరులు పాల్గొన్నారు. ఈ ధరలు పెంచడం ద్వారా ఇప్పుడిప్పుడే కరోనా కష్టకాలం నుండి కోలుకుంటున్న సామాన్య ప్రజల మీద భారం వేసి, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల మీద అధిక పన్నులు వేసి ప్రజాధనాన్ని  దోచుకుంటూ, ప్రజల నడ్డి విరిచే విధంగా ఉన్నాయి. కేంద్రం మీద రాష్ట్రం - రాష్ట్రం మీద కేంద్రం కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు ధరలపై ఒకరి మిద ఒకరు నెట్టివేస్తూ నిరసన కార్యక్రమాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న ఈ కేంద్ర బిజేపి, - రాష్ట్ర టీఆర్ఎస్ ప్రభుత్వాలను గద్దె దింపాలి. పెరుగుతున్న ధరలను నియంత్రణ చెయ్యాలంటే బహుజన రాజ్యం తప్పకుండా రావాలని అందుకు మనం అందరం కలిసి ఏనుగు గుర్తుకు ఓటు వేస్తేనే అది సాధ్యమవుతుంది.