కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసుల సమస్యలు పరిష్కరించాలి

Published: Saturday October 08, 2022
జన్నారం, అక్టోబర్ 02, ప్రజాపాలన:  కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసుల సమస్యలు పరిష్కరించాలని మండలంలోని అయా గ్రామ ప్రజలు, పటేళ్లు, సార్ మేడిలు, మహిళలు, విద్యార్థి ఉద్యోగ సంఘ నాయకులు, వివిధ ఆదివాసి సంఘాలు, తుడుం దెబ్బ మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక తహసిల్దార్ ఇట్యాల కిషన్ వినతి పత్రం అందించారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని తాసిల్దార్ కార్యాలయంలో వారు మాట్లాడుతూ చట్టంలో లేని లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తొలగించాలని ఆదివాసులు సాగు చేసుకున్న పోడు భూములకు వెంటనే హక్కు పత్రాలు ఇవ్వాలన్నారు. పేసా 1/70 చట్టాలను పకడ్బందీగా అమలు చేయాలని, జీవో ఎంఎస్ నెంబర్ మూడు ను యధావిధిగా అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఏజెన్సీ లేని గిరిజన గ్రామాలను ఏజెన్సీ గిరిజన గ్రామాలుగా గుర్తించాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో తుడుం దెబ్బ మండల అధ్యక్షుడు అర్ఎస్ కాళీ, తుడుం దెబ్బ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం వసంత్, రాయి సెంటర్ ఉపరమేడి మండాడి జంగు పటేల్, ఆత్రం రాంషా మండల సార్ మేడి జిల్లా మహిళా అధ్యక్షురాలు మనసుకుల్ల సుశీల, తుడుందెబ్బ మండల కార్యదర్శి మడావి నాగార్జున్, ఆత్రం బొద్దు పటేల్, తురుముజు, ఆత్రం కీర్తన రావు, ఆదివాసి సేన మండల అధ్యక్షుడు దుర్వా యశ్వంతరావు తదితరులు పాల్గొన్నారు.