ప్రధాని మోడీ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు చెప్పాలి : సునీతా రావు

Published: Thursday February 10, 2022
హైదరాబాద్ 9 ఫిబ్రవరి ప్రజాపాలన : హైదరాబాద్ నాంపల్లి చౌరస్తా వద్ద భారత ప్రధాని నరేంద్ర మోడీ దిష్టి బొమ్మకు దహన సంస్కారం రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీతా రావు ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ పై సోమవారంనాడు ప్రధాని నరేంద్ర మోడీ ఉభయ సభలను ఉద్దేశించి మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలను వెంటనే బేషరతుగా ఉపసంహరించుకో వాలన్నారు. అంతే కాకుండా తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శ్రీమతి సునీత రావు డిమాండ్ చేశారు. సునీతా రావు మాట్లాడుతూ అనేక సంవత్సరాల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీ పై అవాకులు చెవాకులు చేయడం ప్రధాన మంత్రి హెూదాలో ఉన్న వ్యక్తికి తగదని అన్నారు. ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ లో నష్టపోయినప్పటికీ ప్రజల అభీష్టం మేరకు నాడుచుకున్న పార్టీని కించపరిచే విధంగా మాట్లాడడం సమంజసం కాదని అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం చేసేటప్పుడు రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీపై చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించారు. కులాలకు అతీతంగా, అన్ని ప్రాంతాల ప్రజలను సమభావంతో చూస్తూ అన్ని రాష్ట్రాల ప్రజలకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు తీరని అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జనాభా ప్రాతిపదికగా విద్య, ఉద్యోగ రంగాలలో రిజర్వేషన్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమె డిమాండ్ చేశారు. దేశ  8వ బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా ప్రధాని స్థాయి వ్యక్తి దిగజారి మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. గతంలో ప్రధానమంత్రులు జవహర్లాల్ నెహ్రూ. ఇందిరాగాంధీ, మన్మోహన్ సింగ్ లాంటి వ్యక్తులు అన్ని రాష్ట్రాలకు న్యాయం చేశారని చెప్పారు. అనేక సందర్భాలలో ప్రతిపక్షాలను గౌరవిస్తూ మాట్లాడడం జరిగిందని వివరించారు. వెంటనే బేషరతుగా దేశ ప్రధాని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని లేకుంటే కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మహిళ కాంగ్రెస్ ఇన్చార్జి కోఆర్డినేటర్ నీలం పద్మ. వైస్ ప్రెసిడెంట్ వరలక్ష్మి. సదాలక్ష్మి. హైదరాబాద్ ప్రెసిడెంట్ కవిత. కామారెడ్డి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ మాధవి పుష్ప రెడ్డి. షబానా. పి కవిత. పద్మ. జయ. కృప. షహనాజ్. జరీన్. జిలాని వెంకటమ్మ అలివేలు ఇందిరా మొదలగువారు పాల్గొన్నారు.