ఘనంగా ఉక్కు మనిషి,సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు.

Published: Wednesday November 02, 2022
బూర్గంపాడు ( ప్రజాపాలన.)
భద్రాద్రి జిల్లా బూర్గంపహడ్ మండల కేంద్రంలో గల ఎస్.జె.పి.బి.ఎం ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు ప్రిన్సిపాల్ చీన్యా ఆధ్వర్యంలో సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతి వేడుకలు ఎన్,ఎస్,ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో భాగంగా ముందుగా ప్రిన్సిపాల్ చీన్యా సర్ధార్ వల్లభాయ్ పటేల్ చిత్ర పటానికి పూలమాల వేసి అనంతరం కొబ్బరికాయ కొట్టి నమస్కరించారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రిన్సిపాల్ చీన్యా మాట్లాడుతూ సర్ధార్ వల్లభాయ్ పటేల్ యెక్క గొప్పతనాన్ని వివరిస్తూ నా హీరో,నా అభిమాని సర్దార్ వల్లభాయ్ పటేలే అని విద్యార్థులు,లెక్చలర్లు అచ్యర్యపోయే విధంగా ప్రిన్సిపాల్ చీన్యా  ఆయన గొప్పతనం గురించి ప్రసంగించారు.ఆ నాడు ఆయనే లేకుంటే యన్నడో భారతదేశం ముక్కలయ్యేది అని ఆయన అన్నారు.అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సీనియర్ అధ్యాపకులు సి.హెచ్ నాగేశ్వరావు మాట్లాడుతూ సర్ధార్ వల్లభాయ్ పటేల్ ప్రముఖ స్వాతంత్ర్య యోధుడిగానే కాకుండా స్వాతంత్ర్యానంతరం సంస్థానాలు భారతదేశములో విలీనం కావడానికి గట్టి కృషిచేసి సఫలుడై ప్రముఖుడిగా పేరుపొందారనీ, హైదరాబాద్,జునాగఢ్ లాంటి సంస్థానాలు భారతదేశములో విలీనం చేసిన ఘనత ఇతనికే దక్కుతుందనీ,ఇంగ్లాండులో బారిష్టరు పట్టా పుచ్చుకొని స్వదేశానికి తిరిగివచ్చి దేశంలో జరుగుతున్న జాతీయోద్యమానికి ఆకర్షితుడై బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా మహాత్మాగాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న స్వాతంత్ర్యోద్యమంలో పాలుపంచుకున్నాడనీ ఆయన అన్నారు.ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎన్,ఎస్,ఎస్ పి.ఓ జీ.శ్రీనివాస్ మాట్లాడుతూ సర్ధార్ వల్లభాయ్ పటేల్ గొప్ప వ్యక్తి అని బార్దోలిలో జరిగిన సత్యాగ్రహానికి నాయకత్వం వహించి విజయవంతం చేయడమే కాకుండా తాను దేశప్రజల దృష్టిని ఆకర్షించాడనీ,బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్ర్య ఉద్యమంలోనే కాకుండా దేశప్రజల సంక్షేమం కోసం అనేక సాంఘిక ఉద్యమాలను చేపట్టాడనీ ఆయన అన్నారు.ఇట్టి కార్యక్రమంలో విద్యార్థులు సర్ధార్ వల్లభాయ్ పటేల్ బాటలో నడుస్తమని జాతీయ సమైక్యత దినోత్సవ ప్రతిజ్ఞ చేశారు.ఈ కార్యక్రమంలో కళాశాల లెక్చలర్లు సుమన్ కుమార్,డి.శ్రీనివాస్,ముకుందం,సాహితీ,నరేష్,శివ,శ్రీను నాన్ టీచింగ్ సిబ్బంది పాల్గొన్నారు.