మేడ్చల్ జిల్లా మున్నూరు కాపు సంఘం కన్వీనర్ ఎన్నిక నిబంధనలకు విరుద్ధం

Published: Friday March 03, 2023
మేడిపల్లి, మార్చి 2 (ప్రజాపాలన ప్రతినిధి)
మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అద్యక్షులు కొండ దేవయ్య సంఘం బైలాకు వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటూ రాష్ట్ర కార్యవర్గ సభ్యులకు గాని నియోజకవర్గ కోఆర్డినేటర్ లకు తాను తీసుకునే నిర్ణయాలను తెలియపరచకుండా ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు తీసుకుంటున్నారని ఉప్పల్, మేడ్చల్,శేర్లింగంపల్లి,కూకట్పల్లి, మల్కాజ్గిరి, కంటోన్మెంట్  నియోజక వర్గాల మున్నూరు కాపు సంఘం కోఆర్డినేటర్ లు గంథం నాగేశ్వరరావు పటేల్, మమిండ్ల శ్రీనివాస్ పటేల్,             పర్వత సతీశ్ పటేల్, బాసేట్టీ నర్సింగ్ రావు పటేల్,  సింగం సతేయ్యా పటేల్,  ఆకుల సతీశ్ పటేల్ లు ఆవేదన వ్యక్తం చేశారు. ఉప్పల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండ దేవయ్య సంఘం బైలాను తుంగలో తొక్కి ఒక రాజ్యాంగేతర శక్తిగా ప్రవర్తిస్తున్నారని ఆయనపై తీవ్రమైన ఆరోపణలు చేశారు.
మేడ్చల్ జిల్లా సంఘం నూతన కన్వీనర్ గా పుప్పల భాస్కర్ నియామకం చెల్లదని వారు తెలిపారు. సంఘం అధ్యక్షులు తీసుకున్న నిర్ణయాలను
 వారు వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.  హైదరాబద్ జిల్లా అధ్యక్షున్ని గ్రేటర్ హైద్రాబాద్ అధ్యక్షునిగా చేసి మేడ్చల్ జిల్లా ఉనికి లేకుండా చేస్తున్నా పట్టని మేడ్చల్ జిల్లా అధ్యక్షులు హనుమంతు రావుకు ఇప్పుడు అధ్యక్షునిగా జ్ఞాపకం వచ్చిందా ఆని వారన్నారు. ఇలాంటి ఒంటెద్దు పోకడలకు చమరగీతం పాడకుంటే కొండ దేవయ్యకు చమర గీతం పడవలసి వస్తుందని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర కార్యదర్శి వేల్పుల శ్రీనివాస్, మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షులు కర్ర వెంకటేష్, కీసర మండల అధ్యక్షులు చిందం మహేందర్, కోశాధికారి వెంకటేశ్వరరావు, సలహాదారులు  కొడిమ్యాల శ్రీనివాస్, కమలాకర్, గంధం వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.