ఆరోగ్యానికి రక్షణ దేహదారుఢ్యం

Published: Monday October 17, 2022
అల్టిమేట్ ఫిట్నెస్ క్లబ్ వ్యవస్థాపకులు వసీం బాబా అభిషేక్
వికారాబాద్ బ్యూరో 16 అక్టోబర్ ప్రజా పాలన : దేహదారుఢ్యం ఉన్న ప్రతి వ్యక్తి ఆరోగ్యంగా ఉంటారని అల్టిమేట్ ఫిట్నెస్ క్లబ్ వ్యవస్థాపకులు మొహమ్మద్ వసీం బాబా, అభిషేక్ సంయుక్తంగా తెలిపారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని ఇండస్ ఇండ్ బ్యాంక్ ఎదురుగా ఉన్న అల్టిమేట్ ఫిట్నెస్ క్లబ్ జిమ్ ను వ్యవస్థాపకులు అభిషేక్ మహమ్మద్ వసీం బాబా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అల్టిమేట్ ఫిట్నెస్ క్లబ్ ను కృష్ణ చారి, మహమ్మద్ ఇబ్రహీం బాబా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అల్టిమేట్ ఫిట్నెస్ క్లబ్ జిమ్ లో ప్రధానంగా మూడు అంశాలపై దృష్టి పెట్టనున్నారని తెలిపారు అవి మొదటిది స్ట్రెంత్ రెండవది కార్డియో మూడవది క్రాస్ ఫిట్ వంటి అంశాలలో ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నామని జిమ్ వ్యవస్థాపకులు స్పష్టం చేశారు అందులో భాగంగా బార్ స్కాట్ మిషన్ లెగ్ ప్రెస్ చెస్ట్ బెంచ్ ప్రెస్ మల్టీ ఫంక్షన్ మిషన్ ల్యాట్ ఫుల్ అప్ ఫుల్ డౌన్ ఫోరం ఫుల్ అప్ మిషన్ ట్రెడ్ మిషన్ ఫ్యాట్ లాస్ వెయిట్ గెయిన్ వంటి అంశాల గురించి శిక్షణ ఇవ్వనున్నామని స్పష్టం చేశారు దేహదారుఢ్యంతో బిపి షుగర్ వంటి రోగాలు దరి చేరవని భరోసా ఇచ్చారు.