గ్రామపంచాయతీ సర్పంచ్ కార్యదర్శులకు శిక్షణ జన్నారం మండల పంచాయతీ అధికారి ఎస్ రమేష్

Published: Monday October 17, 2022
జన్నారం, అక్టోబర్ 16, ప్రజాపాలన:  మండలంలోని గ్రామపంచాయతీ సర్పంచులకు కార్యదర్శులకు, మంచిర్యాల జిల్లాలోని బీమా గార్డెన్ సోమవారం జిల్లా కలెక్టర్ భారతి హోలికేరి ఆధ్వర్యంలో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని జన్నారం మండల పంచాయతీ అధికారి ఎస్ రమేష్ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మండలంలోని గ్రామపంచాయతీలలో నమోదు చేసే వివాహాల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల జారీపై జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో శిక్షణ నిర్వహిస్తారన్నారు. మండలంలోని అన్ని గ్రామపంచాయతీ కార్యదర్శులు సర్పంచులు శిక్షణకు హాజరై వినియోగించుకోవాలని ఆయన తెలిపారు.