రూ.500 కోట్ల తో గల్ఫ్. వెల్ఫేర్ నిధి ఏర్పాటు చేయాలి.

Published: Saturday October 02, 2021
తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు.
మంచిర్యాల బ్యూరో, అక్టోబర్ 01, ప్రజాపాలన : అసెంబ్లీ సమావేశాలలో తెలంగాణ గల్ఫ్ కార్మికుల కోసం రాష్ట్ర ప్రభుత్వం 500 కోట్ల ప్రత్యేక (నిధి) బడ్జెట్ కేటాయించా లని డిమాండ్ చేస్తూ శుక్రవారం జన్నారం మండల కేంద్రం లో తెలంగాణ గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్ష చెఫట్టారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు పెరుగు మల్లికార్జున్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అమరగొండ తిరుపతిల కు మండల అధ్యక్షులు పరకాల మహేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ దూమల్ల ఎల్లయ్య లు పూలమాలలు వేసి దీక్షను ప్రారంబిం చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ 2014 లో గల్ఫ్ కార్మికుల కోసం రూ. 500 కోట్లతో ప్రత్యేక నిధిని కేటాయిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అధికారంలోకి వచ్చి 7 సంవత్సరాలు గడిచినా ముఖ్యమంత్రి హామి అమలుకు నోచుకోలేదని విమర్శించారు. పోరాడి సాదించుకొన్న తెలంగాణ లో గల్ఫ్ కార్మికుల బాధలు, గోసాలు కార్మికుల కుటుంబాలను వెంటాడుతున్నాని పేర్కొన్నారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల లో 500 కోట్లతో ప్రత్యేక బడ్జెట్ కేటాయించక పోతే ఈ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించి పోరాటం ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ప్రధానకార్యదర్శి ఎరుకల రమేష్ గౌడ్, నాయకులు వేముల నాగేష్, సింగపూర్ శాఖ అధ్యక్షులు కోడిజుట్టు నరేష్, జునుగురి రామన్న తిమ్మాపూర్ గ్రామ కమిటీ నాయకులు రవి నాయక్, జాడి శంకర్, దేవ వెంకటేష్ జాడి శివ, జునుగురు కార్తీక్, దర్శనాల భూమేష్, కూకటికారు దీపాక్ అహ్మద్ పాషఖాద్రీ లు పాల్గొన్నారు అలాగే ఇయోక్కకార్యక్రమానికి మండలంలో బీజేపీ మండల అధ్యక్షులు గోలి చందు, కొంతం శంకరయ్య, మధు BJYM నాయకులు ప్రవీణ్, మహేష్, ముజ్జు కాంగ్రెస్ మారియు ముత్యం రాజన్న తదితరులు  సంఘీభావం తెలిపారు