ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 24 ప్రజాపాలన ప్రతినిధి *రాష్ట్రంలో నెలకొన్న విద్యారంగ సమస్యలను వెంట

Published: Wednesday January 25, 2023

విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న రాష్ట్ర ప్రభుత్వం
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం- సాగర్ జాతీయ రహదారి అంబేద్కర్ చౌరస్తా వద్ద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని రాష్త్ర కమిటీ పిలుపు మేరకు విద్యార్థులతో ర్యాలీతో వెళ్లి,రాస్తారోకో నిర్వహించడం జరిగింది,అనంతరం విద్యార్ధి నాయకులను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది.
ఈ సందర్భంగా ఏబీవీపీ నాయకులు మాట్లాడుతూ. తెలంగాణ  రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి ఎనీమిది సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇప్పటివరకు రాష్ట్రంలో  విద్యార్థులు అనేకమైన విద్యారంగ సమస్యలతో సతమతమవుతుందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేసి పేద మధ్యతరగతి విద్యార్థులందరికీ న్యాయం చేయాలని అన్నారు.రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్లో ఉన్న 5000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్,స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలనీ.స్కాలర్షిప్లను ప్రతి నెలకు 3500 రూ ల చొప్పున ప్రతీ విద్యార్థి అకౌంట్లలో వేయాలని,సంక్షేమ హాస్టల్లో జరుగుతున్న ఫుడ్ పాయిజన్ గురించి హైకోర్ట్ సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించాలని,300 గురుకులాలకు నూతన భవనాలు నిర్మించి,మౌళిక వసతులు కల్పించాలని,ప్రభుత్వ జూనియర్ కాళాశాలలో మౌలిక వసతులు కల్పించాలని,యూనివర్సిటీలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించాలని,ఇబ్రహీంపట్నంలో ని నూతన ప్రభుత్వ డిగ్రీ కళాశాల వెంటనే విద్యార్థులకు అందుబాటులోకి తేవాలి,ప్రతి గ్రామానికి ఆర్ టి సి బస్సులను విద్యార్థులకు అనుకూలంగా నడపాలని డిమాండ్ చేశారు.రానున్న రోజుల్లో ఏబీవీపీ  పెద్ద ఎత్తున ఉద్యమాన్ని  చేపడతామని  అన్నారు.ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు శ్రీరామ్,వీరపట్నం జిల్లా కన్వీనర్ సాయి చరణ్,గ్రేటర్ హైదరాబాద్ జాయింట్ సెక్రటరీ వంగ.సంజీవ రెడ్డి,సీనియర్ నాయకులు శశిధర్ రెడ్డి,రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివ కృష్ణ,హాస్టల్ కన్వీనర్ జగదీష్, ఎస్ ఎఫ్ ఎస్  కన్వీనర్ సందీప్,హైదరాబాద్ కార్యవర్గ సభ్యులు ప్రవీణ్,సందీప్,సీనియర్ నాయకులు పవన్,వీరపట్నం, కందుకూరు,మహేశ్వరం నగర కార్యదర్శులు ముత్యాల.సాయి చందు,సాయి,రాఘవేందర్,నాయకులు గణేష్,శివాని,శివలిలా,దీపక్,శివ,జగన్,ప్రసాద్,సన్నీ,అనిల్,చోటు,జగదీష్,విజయంద్ర, వినేయ్,రాజేష్,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.