మధిరలో తెనుగోళ్ల సంక్షేమసంఘం ఆధ్వర్యంలో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ నివాళులు

Published: Tuesday September 28, 2021
మధిర, సెప్టెంబర్ 27, ప్రజాపాలన ప్రతినిధి : సెప్టెంబతెనుగోళ్ల సంక్షేమం అధ్యక్షుడు పసుపులేటి నాగేంద్ర శ్రీనివాసరావు ఆధ్వర్యంలో బాపూజీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం ఈ సందర్భంగా మాట్లాడుతూనిరంకుశ నిజాం వ్యతిరేక, తెలంగాణ ఉద్యమ నాయకులలోన ప్రముఖుడైన కొండా లక్ష్మణ్ బాపూజీ కొమరంభీం జిల్లా, వాంకిడి గ్రామంలో 1915 సెప్టెంబర్ 27న జన్మించాడు. 1 స్వాతంత్ర్యోద్యమంలో, నిరంకుశ నిజాం వ్యతిరేక ఉద్యమంలోనూ చురుకుగా పాల్గొన్నాడు. 1952లో ఆసిఫాబాదు నుంచి ఎన్నికై హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్ శాసనసభలకు ప్రాతినిధ్యం వహించాడు. ఆ తర్వాత కూడా శాసనసభ్యుడిగా నుంచి ఎన్నికై 1971 వరకు శాసనసభ్యునిగా కొనసాగినాడు. నిఖార్సయిన తెలంగాణ వాది. తెలంగాణ కోసం 1969లో మంత్రి పదవిని కూడా తృణప్రాయంగా వదిలిలేసిన నిబద్ధత కలిగిన రాజకీయవేత్త. 1969, 2009-12 తెలంగాణ ఉద్యమాలలో పాల్గొన్నాడు. రాష్ట్ర చేనేత సహకార రంగానికి కూడా కృషిచేశాడు. సెప్టెంబర్ 21, 2012 నాడు 97 సంవత్సరాల వయస్సులో హైదరాబాదులో మరణించాడు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు పాల్గొన్నారు