శివాలయం పునర్నిర్మాణ ధ్వజస్తంభం ప్రతిష్ట ఆహ్వాన పత్రిక ను ఆవిష్కరించిన *

Published: Monday January 16, 2023
*జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు మధిర జనవరి 14 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో శనివారం నాడు స్థానిక శ్రీ మృత్యుంజయ స్వామి వారి దేవస్థాన నిర్మాణ పనులను పరిశీలించిన *జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు  వైరా నది ఒడ్డున ఉన్న శ్రీ మృత్యుంజయ  స్వామి వారి దేవస్థానం పునర్నిర్మాణం  ధ్వజస్తంభ ప్రతిష్ట ఆహ్వాన పత్రిక ను శనివారం నాడు ఆలయ ప్రాంగణంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు ఆవిష్కరించారు ఫిబ్రవరి నెల 1వ తేదీ నుండి 5వ తేదీ వరుకు జరిగే కార్యక్రమ వివరాలతో ఈ ఆహ్వాన పత్రిక ఏర్పాటు చేశారు. ముందుగా ఆలయానికి చేరుకున్న కమల్ రాజు  ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు సందర్భంగా వారు  మాట్లాడుతూ రెండో కాశీగా పిలవబడుతున్న స్థానిక మృత్యుంజయ స్వామి దేవాలయంలో దాతల సహకార తో అభివృద్ధి చేసిన. పాలకవర్గం అభినందనలు తెలుపుతూ స్వామివారి సంబంధించిన ఆహ్వాన పత్రికలు ఆవిష్కరించినందుకు మృత్యుంజయ స్వామివారి కృపకు పాత్రులు అయ్యామని వారు తెలిపారు ఈ   కార్యక్రమంలో ఆలయ పాలకమండలి చైర్మన్ వంకాయలపాటి నాగేశ్వరరావు , మధిర సొసైటీ చైర్మన్ బిక్కి కృష్ణప్రసాద్ , కౌన్సిలర్ యన్నంశెట్టి అప్పారావు , కరివేద సుధాకర్ , పట్టణ పార్టీ అధ్యక్షుడు పల్లపోతు వెంకటేశ్వరరావు గారు, పరిషా శ్రీనివాసరావు గారు సహా పలువురు ఆలయ ధర్మకర్తలు, అర్చకులు తదితరులు పాల్గొన్నారు.