నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు : ఎస్సై దేవం బోట్ల రాజు

Published: Wednesday May 05, 2021

పరిగి, 4 మే ప్రజాపాలన ప్రతినిధి : వికారాబాద్ జిల్లా దోమ మండల కేంద్రంలో ఎస్సై రాజు మంగళవారం ఆటో స్టాండ్ దగ్గర వివిధ గ్రామంలప్రజలకు కరోణ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్బంగా ఎస్సై రాజు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం జీవో 68,69 జారీ చేయడం జరిగిందని తెలిపారు. జీవో-68 నిబంధనల ప్రకారం గ్రామంలోని ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని, సామాజిక దూరం పాటించాలన్నారు. బహిరంగ ప్రదేశాలలో, పనిచేయుచున్న స్థలాలలో, వ్యాపార లావాదేవీల విషయంలో, ప్రయాణిస్తున్న సందర్బాలలో పై నియమాలను పాటించాలని తెలిపారు. జీవో-69 నిబంధనల ప్రకారం సభలు, సమావేశలు,ఊరేగింపులు, విందులు చేయరాదన్నారు.అత్యవసర పరిస్థితుల్లో 100 కు డైల్ చేయాలని సూచించారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడునని తెలిపారు. ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. మాస్క్ లేకపోతే 1000 జరిమానావేస్తాము అన్నారు. మాస్క్ లేకపోతె 1000 జరిమానా అనంతరం దోమ ఆటో స్టాండ్ దగ్గర  బోయిని శ్రీను మాస్కు లేకుండా మెయిన్ రోడ్ పై వెళ్తుండగా ఆ వ్యక్తికీ 1000రూ, జరిమానా విదిచారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ గోపాల్ గౌడ్. పోలీసు సిబ్బంది కానిస్టేబుల్స్ రాజు. గ్రామస్థులు తదితరులుపాల్గొన్నారు.