దెందుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హెచ్ఎం పైన చర్యలు ఏవి ? సర్పంచ్

Published: Thursday March 02, 2023
మధిర రూరల్ మార్చి ఒకటి ప్రజాపాలన ప్రతినిధి మండలం పరిధిలో దెందుకూరు జిల్లా పరిషత్ పాఠశాలలో హెచ్ఎం పై చర్యలుఏవిపాత పుస్తకాలను విద్యార్థుల నుండి తీసుకొని వాటి తోపాటుగా స్కూలుకు సంబంధించిన పుస్తకాలను అమ్ముకొని సొమ్ము చేసుకున్న హెచ్ఎం కె నారాయణ దాసుహెచ్ఎం పాఠశాలకు సంబంధించిన పలు కార్యక్రమాల్లో ప్రోటోకాల్ పాటించటలేదని గ్రామ సర్పంచ్ డీఈవోకు తెలియజేసిన ఇప్పటివరకు చర్యలు శూన్యంజిల్లా పరిషత్ ఉన్నత
పాఠశాల దెందుకూరు ను డీఈవో సోమశేఖర్ శర్మ, ఎంఈఓ వై ప్రభాకర్ తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేసిన సమయంలో హెచ్ఎం స్కూల్లో లేకపోవడం, విద్యార్థులకు సంబంధించిన పుస్తకాలు, స్కూలుకు సంబంధించిన పుస్తకాలను అమ్ముకోవడం.పాఠశాలలో ఉన్న సమస్యలు గురించి విద్యార్థులను  డీఈఓ తనిఖీ చేసిన సందర్భంలోతెలుసుకున్నారు. అదేవిధంగా దెందుకూరు పాఠశాలలోని అనేక ఆర్థిక లావాదేవీలకు సంబంధించి అవకతవకలకు హెచ్ఎం పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. కనీసం ప్రోటోకాల్ కూడా పాటించటలేదని పాఠశాలకు సంబంధించిన కార్యక్రమాలకు గ్రామ సర్పంచ్  కోట విజయశాంతి కి తెలియజేయటలేదు అని   డీఈవో కు ఫిర్యాదు చేశారు. ఈ విషయాలపై సంబంధిత హెచ్ఎం నారాయణదాసు పై చర్యలు తీసుకుంటానని చెప్పిన డి ఈ ఓ
ఇంతవరకు అమలు చేయలేదు .వెంటనే డీఈవో స్పందించి చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.