భట్టి విక్రమార్క పాదయాత్రలో పాల్గొన్న మధిర మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు

Published: Friday March 04, 2022
మధిర మార్చి 3 ప్రజాపాలన ప్రతినిధి మధిర నియోజకవర్గపరిధిలో మండల కాంగ్రెస్ నాయకులు ఆధ్వర్యంలో ముదిగొండ మండలం లో ఐదవ రోజు జరుగుతున్న పీపుల్స్ మార్చ్ మహా పాదయాత్రలో భాగంగా పదం పదం కలుపుటకు మీకు మేమున్నామంటూ మధిర మండలం నుండి కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఈ పాదయాత్రలో మధిర మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సూరం శెట్టి కిషోర్ మధిర మండల ఎస్సీసెల్ అధ్యక్షుడు దారా బాలరాజు మధిర నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు తూమాటి నవీన్ రెడ్డి సైదలిపురం సర్పంచ్ పులి బండ్ల చిట్టిబాబు మధిర మండల ఐఎన్టియుసి అధ్యక్షుడు కోరంపల్లి చంటి మధిర పట్టణ కాంగ్రెస్ నాయకులు పారుపల్లి విజయ్ కుమార్ మాజీ సర్పంచ్ కర్నాటి రామారావు మొదలగు వారు పాల్గొన్నారు