వినూత్న ఆవిష్కరణలతో ఇంటింటా ఇన్నోవేటర్ జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి

Published: Wednesday July 06, 2022
మంచిర్యాల బ్యూరో, జూలై 4, ప్రజాపాలన  :
 
సమాజంలోని వివిధ రకాల నమన్యలను వినూత్న ఆవిష్కరణలతో పరిష్కరిం  చేందుకు ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమం ఆవిష్కర్తలకు మంచి అవకాశమని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి  తెలిపారు. సోమవారం అనంతరం ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమం సంబంధిత గోడప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వినూత్న పరిష్కార మార్గాలతో ఆవిష్కర్తలు రూపొందించిన ఆవిష్కర  ణలతో దరఖాస్తు చేసుకోవాలని, అన్ని రంగాల వారు, విద్యార్థులతో మొదలుకొని ఉపాధ్యాయులు, రైతులు, యువకులు, ఐ.టి. నిపుణులు, గృహిణులు, రిసెర్చర్స్ అన్ని విభాగాల వారు తాము కనుగొన్న వినూత్న ఆవిష్కరణలలో ఉత్తమమైన వాటిని గుర్తించి ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రదర్శించడం జరుగుతుందని పేర్కొన్నారు., ఆన్లైన్లో ఎగ్జిబిషన్ లింక్ ద్వారా ప్రజలు ఆవిష్కరణలను చూడవచ్చని, ఎంపికైన వారిని ప్రశంశ పత్రంతో అభినందించడం జరుగుతుం దని తెలిపారు. గ్రామీణ, విద్యార్థుల, ప్రారంభ ఆవిష్కరణలు, సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు ఇతరత్రా ప్రజా ఉపయోగకర ఆవిష్కరణలకు ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్న కలెక్టర్ ఆవిష్కర్తలు తమ ఆవిష్కరణకు సంబంధించిన ఆరు వాక్యాలు, రెండు నిమిషాల నిడివి గల వీడియో, ఆవిష్కరణ యొక్క నాలుగు ఫొటోలు, ఆవిష్కర్త పేరు, ఫోన్ నంబర్, వయస్సు, వృత్తి, చిరునామా వివరాలను 9100678  543కి వాట్సాప్ చేయాలని, ఆవిష్కర్తల నుండి ఆగస్టు 5వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుం  దని తెలిపారు. .  ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి మధుబాబు, జిల్లా పౌరసంబంధాల అధికారి సంపత్ కుమార్, సెక్టోరల్ అధికారి చౌదరి సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area