మున్సిపల్ అధికారులతో పారిశుద్ధ్యం హరితహారంపై సమీక్ష సమావేశం...

Published: Tuesday May 18, 2021
జగిత్యాల, మే 17 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల మున్సిపల్ కార్యాలయంలో చైర్ పర్సన్ బోగ శ్రావణి పారిశుద్ధ్యం మరియు హరితహారం విభాగంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం కోవిడ్ -19 సెకండ్ వేవ్ దృష్ట్యా పట్టణ పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించి కరోనా సోకిన ఇండ్ల యందు సోడియం హైపోక్లోరైడ్ పిచికారి చేసి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కోవిడ్ కేసులు పెరగకుండ పారిశుద్ధ్యపై తగు జాగ్రత్తలు పాటించి ఇంటి నుండి వెలువడు తడిచెత్త మరియు పొడిగా వేరుచేసి తీసుకోవాలని ప్రతి వాహనంనకు మైక్ ఏర్పాటు చేసి ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. హరితహారంలో భాగంగా నర్సరీలలో మొక్కల పెంపకంను స్పీడప్ చేయాలని వర్షకాలంలో పట్టణంలోని నాటే మొక్కలకు వార్డువారిగా ప్రణాళిక తయారు చేయాలనీ శ్రావణి సూచించారు. ఈ సమావేశంలో డిఈ లచ్చిరెడ్డి సానిటరీ ఇన్స్పెక్టర్లు మహేశ్వర్ రెడ్డి అశోక్ రాము ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ వెంకటేష్ పాల్గొన్నారు.