ఫీవర్ సర్వే నిర్లక్ష్యం చేయరాదు

Published: Tuesday May 18, 2021
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ 
వికారాబాద్ మే 17, ప్రజాపాలన బ్యూరో : గ్రామంలో ఇంటింటి ఫీవర్ సర్వే నిర్లక్ష్యం చేయరాదని ఆశా వర్కర్లను, వైద్యాధికారులను ఆదేశించారు. సోమవారం వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ధారూర్ మండలంలోని కేరెల్లి గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గ్రామంలో ఎన్ని కరోనా కేసులు ఉన్నాయి, ఎంత మంది హోం ఐసోలేషన్ లో ఉన్నారు, ఎంత మంది రికవరీ అయ్యారో, అక్కడ ఉన్న వైద్య సిబ్బందిని, ప్రజాప్రతినిధులను అడిగి తెలుసుకున్నారు. ఉపాధి పనికి వెళ్ళే వారు ప్రతి ఒక్కరూ మాస్కు ధరించి, భౌతిక దూరాన్ని పాటించాలని గ్రామస్థులకు తెలియజేశారు. కరోనా సోకిన వ్యక్తి ఇంటి నుండి బయటకు రావొద్దన్నారు. గ్రామంలో పర్యటిస్తూ పల్లె ప్రగతిలో పూర్తి కాని పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. రోడ్ల పక్కనే ఉన్న బావులను మూసివేయాలన్నారు. ఇళ్లకు మధ్యలో ఉన్న కరెంట్ స్థంభాన్ని తీసి పక్కకు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ నరసింహారెడ్డి, ఎంపీటీసీ శ్రీనివాస్, మాజీ సర్పంచ్ సంతోష్ కుమార్, గ్రామ పార్టీ ప్రెసిడెంట్ రామకృష్ణారెడ్డి, ఏఎంసి డైరెక్టర్ నర్సింహ రెడ్డి, కోవిడ్ జిల్లా అధికారి అరవింద్, వైద్యులు వైద్య సిబ్బంది, పార్టీ నాయకులు పాల్గొన్నారు.