తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు నూనేటి కొమరయ్య యాదవ్ మృతి

Published: Tuesday July 05, 2022
బెల్లంపల్లి జూలై 4 ప్రజా పాలన ప్రతినిధి: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 1969 లో జరిగిన తొలి తరం ఉద్యమములో చురుకుగా పాల్గొని జైలుకెళ్లిన బెల్లంపల్లి పట్టణం బాబు క్యాంప్ బస్తీ కి చెందిన నూనేటి కొమరయ్య యాదవ్, సోమవారం ఉదయం మృతి చెందారు.
మలితరం ఉద్యమంలో కూడా ఉద్యమకారులకు తగిన సూచనలు, సలహాలు ఇస్తూ, మలితరం ఉద్యమానికి కూడా తన మేధాశక్తిని అందించి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక తెలంగాణ ఉద్యమకారునిగా అవార్డు పొందిన కొమురయ్య యాదవ్ మృతి తీరనిలోటని పట్టణ తెలంగాణ ఉద్యమకారులు అన్నారు.
ఆయన భౌతిక కాయానికి తెలంగాణ ఉద్యమకారులు, తెరాస  నాయకులు, మున్సిపల్ కౌన్సిలర్లు, పోలు శ్రీనివాస్,నీలి కృష్ణ, మాజీ కౌన్సిలర్లు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, తదితరులు, శ్రద్ధాంజలి ఘటించి వారి కుటుంబ సభ్యులకు సంతాపాన్ని తెలిపారు.